Home
Mobile

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ కీలక వివరాలు లీక్‌.. 6.8 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నుంచి ఇటీవలే నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అయితే తాజాగా వన్‌ప్లస్‌ 13 హ్యాండ్‌సెట్‌కు (OnePlus 13 Smartphone) సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం చివరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే తాజాగా ఈ ఫోన్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు లీక్‌ అయ్యాయి.

కొన్ని నివేదికల ప్రకారం వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలిసింది. అయితే ఈ సంవత్సరం జనవరిలో లాంచ్‌ అయిన వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్ 8 జెన్‌ 3 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

Oneplus 13 5G Smartphone key specs leaked details

టిప్‌స్టర్‌ డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ ఆధారంగా వన్‌ప్లస్‌ సంస్థ ప్రస్తుతం వన్‌ప్లస్‌ 13 హ్యాండ్‌సెట్‌ 6.8 అంగుళాల మైక్రో కర్వడ్‌ LTPO స్క్రీన్‌ సహా 2k డిజైన్‌ ను టెస్టింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ 12 కూడా ఇదే పరిమాణంతో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే కొన్ని అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ ఆప్టికల్‌ స్కానర్‌ను కలిగి ఉండగా.. త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్‌ 13 సరికొత్త డిజైన్ సహా అల్ట్రాసోనిక్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. పెరిస్కోపిక్‌ టెలిఫోటో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. గత లీక్‌ల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

ట్రిపుల్‌ కెమెరా లో భాగంగా 50MP ప్రైమరీ కెమెరా మరియు అల్ట్రావైడ్‌ కెమెరా, టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం చివరలో వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే పైన పేర్కొన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై వన్‌ప్లస్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

** జనవరిలో వన్‌ప్లస్‌ 12 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు విడుదల అయ్యాయి. వన్‌ప్లస్‌ 12 మరియు 12R స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. వన్‌ప్లస్‌ 12 హ్యాండ్‌సెట్‌ 6.82 అంగుళాల 2k ప్రో XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 3168*1440 రిజల్యూషన్‌తో వస్తుంది. LTPO టెక్నాలజీ సపోర్టుతో వస్తుంది. ఫలితంగా రీఫ్రెష్‌ రేట్‌ 1Hz నుంచి 120Hz వరకు ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది.

4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ముందువైపు పంచ్‌ హోల్‌ స్టైల్‌ నాచ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ముందువైపు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను కలిగి ఉంటుంది. అదే వెనుకవైపు కార్నింగ్‌ గ్లాస్‌ 5 రక్షణను పొందుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ను అడెన్నో 750 GPUతో జతచేయబడుతుంది. ఈ చిప్‌సెట్ ట్రినిటీ ఇంజిన్‌ ప్లాట్‌ఫాం ఆధారంగా పనిచేస్తుంది. గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ సమయాల్లో వేగం, మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్‌ OS 14 పైన పనిచేస్తుంది.

వన్‌ప్లస్‌ 12 హ్యాండ్‌సెట్‌ 80W సూపర్‌వోక్‌ వైరడ్‌ ఛార్జింగ్‌, 50W ఎయిర్‌వోక్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W సూపర్‌వోక్‌ వైరడ్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 0-100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 26 నిమిషాల్లోనే చేస్తుంది.

Best Mobiles in India

English summary
Oneplus 13 5G Smartphone key specs leaked expected to launch at the year end
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X