Home
Mobile

మొబైల్ మార్కెట్‌ని ఊపేస్తున్న వన్‌ప్లస్ 13 మినీ.. 6000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, ఇంకా మరెన్నో ఫీచర్ల

OnePlus 13 Mini: భారతదేశంలో టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటైన వన్‌ప్లస్, త్వరలోనే కొత్త ఫోన్ లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. దాన్ని వన్‌ప్లస్ 13 మినీ అని పిలుస్తున్నారు. పేరుకు తగ్గట్టే ఇది చిన్నగా ఉన్నా, ఫీచర్ల విషయంలో ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌కు ఏమాత్రం తీసుపోదు. చిన్న ఫోన్లు కావాలనుకునే వాళ్లకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కావొచ్చు. లీకుల ప్రకారం, వన్‌ప్లస్ కంపెనీ 2024, అక్టోబర్‌లో రిలీజ్ చేసిన వన్‌ప్లస్ 13కి మినీ వెర్షన్‌ను తయారు చేస్తోంది.

సైజులో చిన్నగా ఉన్నా, ఫీచర్లు మాత్రం అదిరిపోతాయి అంటున్నారు. ముఖ్యంగా బ్యాటరీ విషయానికి వస్తే ఏకంగా 6000mAh బ్యాటరీతో వస్తోంది ఈ ఫోన్. వన్‌ప్లస్ 13 మినీలో మెయిన్ హైలైట్ బ్యాటరీనే. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు రోజంతా వీడియోలు చూడొచ్చు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. ఛార్జింగ్ గురించి టెన్షన్ ఉండదు.

OnePlus 13 Mini Set to Launch Soon with 6000mAh Battery  amp amp  Flagship Specs

* చిన్న డిస్‌ప్లే, సూపర్ డిజైన్

వన్‌ప్లస్ 13లో 6.82-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. కానీ వన్‌ప్లస్ 13 మినీలో మాత్రం 6.3-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందట. చిన్నగా, చేతిలో ఇమిడిపోయేలా ఉండాలి అనుకునేవాళ్లకి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. వన్‌ప్లస్, ఒప్పో కంపెనీలు 2025 చివరి నాటికి 6000mAh నుంచి 6500mAh బ్యాటరీలతో చాలా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయట.

డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఒక పాపులర్ టిప్‌స్టర్ వీబోలో ఈ విషయాలను లీక్ చేశాడు. వన్‌ప్లస్ 13 మినీలో బెజెల్-లెస్ LTPO OLED డిస్‌ప్లే ఉంటుందని అంటున్నారు. దీని రిజల్యూషన్ 1.5K. అంటే పిక్చర్లు, వీడియోలు చాలా క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. గేమ్స్ ఆడటానికి, వీడియోలు చూడటానికి సూపర్ ఉంటుంది.

* పర్ఫామెన్స్, కెమెరా

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంటుందట. ఈ ప్రాసెసర్ వల్ల గేమ్స్ ఆడేటప్పుడు అసలు ల్యాగ్ ఉండదు. మల్టీ టాస్కింగ్ కూడా చాలా స్మూత్‌గా చేసుకోవచ్చు. రోజువారీ పనులు కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. వన్‌ప్లస్ 13 మినీలో వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయట.

వాటిలో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉంటాయని సమాచారం. 2x ఆప్టికల్ జూమ్, AI టెక్నాలజీ వంటి ఎక్స్‌ట్రా ఫీచర్లు కూడా లభిస్తాయి అని టాక్‌. AI ఫొటోలు ఇంకా బాగా రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ కెమెరాలతో ఎలాంటి లైటింగ్ కండిషన్స్‌లో అయినా చాలా డీటైల్డ్‌గా, కలర్‌ఫుల్‌గా ఫోటోలు తీసుకోవచ్చు.

* కొన్ని దేశాల్లో వన్‌ప్లస్ 13Tగా రిలీజ్ అయ్యే ఛాన్స్

మరో లీక్ ప్రకారం, వన్‌ప్లస్ 13 మినీ కొన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లలో వన్‌ప్లస్ 13T పేరుతో కూడా రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. కానీ వన్‌ప్లస్ కంపెనీ మాత్రం దీని గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. ఫైనల్ మొబైల్ పేరు ఏంటి, దాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 13 Mini is a upcoming compact flagship mobile with 6000mAh battery, Snapdragon 8 Elite, 6.3\" 1.5K OLED, 50MP triple cameras. Targets users seeking power in a smaller size.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X