Home
Mobile

వన్‌ప్లస్‌ 13, వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ల విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు..

భారత్‌ మార్కెట్‌లోకి వన్‌ప్లస్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల (OnePlus 13 Series) విడుదల తేదీ అధికారికంగా వెల్లడైంది. ఈ హ్యాండ్‌సెట్‌ల గురించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా వన్‌ప్లస్‌ సంస్థ ఈ సిరీస్‌ విడుదలపై ప్రకటన చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 13, వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ట్యాబ్లెట్‌, ఇయర్‌బడ్స్‌, వాచ్‌ ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ వింటర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను (OnePlus Winter Launch Event) జనవరి 7 వ తేదీన నిర్వహించనుంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 13 సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ లాంచ్‌ ఈవెంట్‌ 9:30 PM IST గంటలకు వన్‌ప్లస్‌ యూట్యూబ్‌ ఛానల్, అధికారిక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Oneplus 13 series smartphones india launch date confirmed here are the specs and features

వన్‌ప్లస్‌ 13 హ్యాండ్‌సెట్‌ (OnePlus 13 Smartphone) ఈ సంవత్సరం అక్టోబర్‌ నెలలో చైనాలో లాంచ్‌ అయింది. జనవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌తో 6.82 అంగుళాల 2K 8T LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి రానుంది.

వన్‌ప్లస్‌ 13 హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ 24GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 50W వైర్‌లెస్‌, 100W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్టు, మాగ్నటిక్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్‌ 13 Hasselblad ఆధారిత ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 3X ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్‌ కెమెరాలు సహా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సోనీ IMX615 కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ ప్రారంభ ధర (12GB ర్యామ్ + 256GB స్టోరేజీ) సుమారు రూ.70,000 గా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు మూడు కలర్‌ వేరియంట్‌లో భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌ రేంజ్‌ ధరలో లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ వన్‌ప్లస్‌ Ace 5 పేరుతో చైనాలో డిసెంబర్‌ 26 న విడుదల కానుంది. 13R స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ వేరియంట్ 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ, 8MP సెకండరీ, 50MP కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చే ఉంటుందని తెలుస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ (OnePlus 13R Smartphone) స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో 12GB ర్యామ్‌ మరియు 256GB స్టోరేజీ జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OxygenOS 15.0 తో పనిచేస్తుంది. మరియు 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ధర సుమారుగా రూ.40,000 గా ఉండే అవకాశం ఉంది.\

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 13 series smartphones india launch date confirmed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X