Home
Mobile

వన్‌ప్లస్‌ 13, 13R స్మార్ట్‌ఫోన్‌ల ధర వివరాలు లీక్‌.. జనవరి 7 న భారత్‌ మార్కెట్‌లో విడుదల..!

వన్‌ప్లస్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో జనవరి 7 వ తేదీన విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 13, వన్‌ప్లస్‌ 13R హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ల కొన్ని స్పిసెఫికేషన్‌లు, ఫీచర్‌లు, డిజైన్‌ వివరాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్‌ 13 చైనా మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే వన్‌ప్లస్‌ ఏస్‌ 5 హ్యాండ్‌సెట్ చైనాలో నిన్న లాంచ్‌ అయింది. వన్‌ప్లస్‌ 13R కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా భావిస్తున్నారు. తాజాగా వన్‌ప్లస్‌ 13 సిరీస్‌ ధర వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్‌ ఈ రెండు వేరియంట్‌ల ధర వివరాలను షేర్‌ చేశారు.

వన్‌ప్లస్‌ 13 సిరీస్ గురించి ఇప్పటికే అనేక లీక్‌లు వచ్చాయి. వీటి ఆధారంగా వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ 6.82 అంగుళాల అమోలెడ్‌ QHD+ 2K డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, రక్షణ కోసం గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

OnePlus 13 Series smartphones

స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ మెరుగైన పనితీరు కనబరుస్తుందని వన్‌ప్లస్‌ చెబుతోంది. 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేసే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ Hasselblad టెక్నాలజీతో ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP LYT-808 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌, టెలిఫోటో కెమెరాలతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ కెమెరాల ద్వారా 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. దీంతోపాటు మెరుగైన AI అల్గారిథమ్స్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్‌ (OnePlus 13 Series Expected Price in India) వివరాల ఆధారంగా భారత్‌లో వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ మరియు 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో విడుదల కానుందని తెలిపారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.67,000 నుంచి రూ.70,000 మధ్య ఉంటుందని అంచనా వేశారు.

ఇటీవల చైనాలో విడుదలైన వన్‌ప్లస్‌ ఏస్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వన్‌ప్లస్‌ 13R (OnePlus 13R Series Expected Price in India) ఉంటుందని భావిస్తు్న్నారు. ఏస్‌ 5 ధర చైనాలో 2299 యువాన్‌లుగా (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.26,900) ఉంది. అయితే భారత్‌ మార్కెట్‌ మార్కెట్‌లో 13R స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీ వేరియంట్‌లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

OnePlus 13 Series smartphones

వన్‌ప్లస్‌ Ace 5 ఆధారంగా వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 450 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ 13R హ్యాండ్‌సెట్‌ OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6400 బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను అమర్చి ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X