OnePlus 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. ఇవాళే విడుదల.. ప్రత్యేకతలు తెలుసుకోండి..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్‌లో (Oneplus india winter Launch Event 2025) ఇవాళ వింటర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 13 సిరీస్ (OnePlus 13 Series Launch) విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:00 గంటలకు లాంచ్ కానుంది. విడుదల కార్యక్రమాన్ని వన్‌ప్లస్ యూట్యూబ్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా వీక్షించవచ్చు. ఈ ఈవెంట్‌లో భాగంగా వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 సఫైర్ బ్లూ వేరియంట్ కూడా లాంచ్ కానుంది. దీంతోపాటు మాగ్నటిక్ ఛార్జింగ్ యూక్సెసరీలను కూడా అందుబాటులో తీసుకురానుంది.
గత మోడల్‌తో పోలిస్తే డిజైన్ పరంగా అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. కర్వడ్ డిస్‌ప్లేతో ఫ్లాట్ సైడ్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కెమెరా మాడ్యుల్ వృత్తాకారంగా ఉంది. దీంతోపాటు వన్‌ప్లస్ 13 వేగాన్ లెదర్ మరియు గ్లాస్ డిజైన్‌తో అందుబాటులో ఉంటుంది. రెండు వెర్షన్‌లు IP68 మరియు IP69 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ (OnePlus 13 Smartphone) కటింగ్ ఎడ్జ్ ఫీచర్‌లతో కూడిన ప్రీమియం స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.82 అంగుళాల BOE X2 2K+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 24GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్డేట్లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించనున్నట్లు తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP సోనీ LYT 808 ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుందని తెలుస్తోంది.
ఈ వన్‌ప్లస్ 13 ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W ఫ్లాష్ ఛార్జింగ్, మాగ్నటిక్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కేవలం 36 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని తెలుస్తోంది. IP68 మరియు IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్ (Oneplus 13R Smartphone) 6.78 అంగుళాల 8T LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఒప్పో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీతో జతచేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 తో పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్డేట్లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన లీక్‌ల ఆధారంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.70,000 గా ఉండే అవకాశం ఉంది. అదే వన్‌ప్లస్ 13R ధర సుమారుగా రూ.50,000 గా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








