Home
Mobile

ColorOS 15 తో వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌.. ఈనెలలోనే విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!!

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ (OnePlus 13 Smartphone) ఈ నెలలోనే విడుదల కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ఇప్పటికే అనేక లీక్‌లు వచ్చాయి. గతంలో చిప్‌సెట్‌ సహా కెమెరా, బ్యాటరీ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ వన్‌ప్లస్‌ 13 హ్యాండ్‌సెట్‌ ఈ నెలలో చైనాలో మాత్రమే లాంచ్‌ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్‌లలో ఎప్పడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ ColorOS 15 పైన పనిచేస్తుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్‌ అయ్యాయి.

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ ColorOS 15.. Aurora, Tide డ్యూయల్‌ ఇంజిన్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అరోరా ఇంజిన్‌ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ ఇంజిన్‌ 18% కంట్రోల్‌ రెస్పాన్స్‌ మరియు 40 శాతం కంట్రోల్‌ స్టెబిలిటిని కలిగి ఉంటుంది. మరింత మెరుగైన మోషన్‌ ఎఫెక్ట్‌ను కలిగి ఉంటుంది. టైడ్‌ ఇంజిన్‌ ద్వారా OS ప్రాసెసింగ్‌ స్పీడ్‌ను మెరుగుపరుస్తుంది.

Oneplus 13 Smartphone leaks

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని డిజైన్‌ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 2k రిజల్యూషన్‌ స్క్రీన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఫోన్‌ అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ కంటే అధిక వేగం, మరింత భద్రతను అందిస్తుంది.

ఈ వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4 చిప్‌సెట్‌ పైన పనిచేయనుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ గరిష్ఠంగా 24GB ర్యామ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా అత్యంత మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఫలితంగా ప్రస్తుత మార్కెట్‌లో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

50MP + 50MP +50MP కెమెరాలు :
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ కెమెరా స్పెసిఫికేషన్‌ల వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. f/1.6 అపేచర్‌తో 50MP సోనీ LYT 808 సెన్సార్‌ను కలిగి ఉండనుంది. మరియు 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌ సామర్థ్యంతో 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు గతంలో లీక్‌ అయిన వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌లెట్ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. మరియు వెనుకవైపు గ్లాస్‌ డిజైన్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. గత మోడల్‌ తరహాలోనే LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంది. మరియు భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. 6000mAh లేదా 6100mAh బ్యాటరీ, 100W వైర్‌, 50W వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది.

మరియు గతంలో లీక్‌ అయిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ 6.82 అంగుళాల 2K 10 bit LTPO కర్వడ్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Oneplus 13 Smartphone confirmed to launch with coloros 15 here are the leaked specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X