వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ వేరియంట్ వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానుందంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి త్వరలో కొత్త హ్యాండ్‌సెట్ వన్‌ప్లస్ 13 విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో అక్టోబర్‌లో లాంచ్ కానుంది. గతంలో ఈ స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్ వివరాలు లీక్ అయ్యాయి. ఈ వివరాలు ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. తాజాగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ (Oneplus 13 Smartphone) డిజైన్, కలర్ వేరియంట్ వివరాలు లీక్ అయ్యాయి.
వేగాన్ లెదర్ ఫినిష్‌తో వన్‌ప్లస్ ఫోన్ :
టిప్‌సెట్ సంజు చౌధరీ వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ వివరాలను X ద్వారా షేర్ చేశారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు గ్రీన్ రంగుల్లో వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుకవైపు గ్లాస్ డిజైన్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు కెమెరా మాడ్యూల్ వృత్తాకారంగా ఉంది.

మరియు ఈ వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 13 ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు గత మోడల్ తరహాలోనే LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంది. అయితే భారత్‌లో ఈ హ్యాండ్‌సెట్ ఎప్పుడు విడుదల కానుందో సంస్థ వెల్లడించలేదు. అయితే చైనాలో విడుదలైన తర్వాత మాత్రమే భారత్‌లో విడుదల కానుంది.
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 SoC చిప్‌సెట్ :
ఇప్పటి వరకు లీక్ అయిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల 2K 10 bit LTPO కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. మరియు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
OnePlus 13 more or less will look like this 😀
— Sanju Choudhary (@saaaanjjjuuu) September 17, 2024
Green Color will most likely to come with Vegan leather back!
Expected Specs :-
~6.82" 2K OLED 10 bit 120 Hz LTPO BOE X2 micro quad curved display
~ Snapdragon 8 Gen 4
~50 MP LYT 808 1/1.4" Main + 50 MP LYT 600 1/1.95" Periscope… pic.twitter.com/kXKwUjw3Nf
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ 13 ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP సోనీ LYT 808 1/1.4 అంగుళాల ప్రధాన కెమెరా, 50MP సోనీ LYT 600 1/1.95 అంగుళాల పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాలు సహా LED ఫ్లాష్ లైట్ ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ 13 విడుదల :
వన్‌ప్లస్ 13 భారీ బ్యాటరీతో విడుదల కానుందని తెలుస్తోంది. 6000mAh లేదా 6100mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు 100W వైర్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది. గత మోడల్ 5400mAh బ్యాటరీని మాత్రమే కలిగి ఉంది.
IP68 లేదా IP69 రేటింగ్‌తో :
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు IP68 లేదా IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా రానుంది. కనెక్టివిటీ పరంగా USB-C ఛార్జింగ్ పోర్టు, బ్లూటూత్, వైఫై, GPS వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








