OnePlus 13 స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, చిప్‌సెట్, OS స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడి..ఎప్పుడు లాంచ్ కానుందంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి త్వరలో వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ (OnePlus 13 Smartphone) విడుదల కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ సహా మరిన్ని వివరాలను సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌తో పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ OS వివరాలను కూడా ధ్రువీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 31 న చైనాలో విడుదల కానుంది.
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ (OnePlus 13 conformed Specifications) డిస్‌ప్లే వివరాలను సంస్థ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన BOE సెకండ్ జనరేషన్ ఓరియంటల్ X2 8T LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే HDR10+ మరియు డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది.

దీంతోపాటు ఈ డిస్‌ప్లే డిస్‌ప్లేమేట్ A++ మరియు TUV Rhenland ఇంటెలిజెంట్ ఐ ప్రొటెక్షన్ 4.0 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. మరియు వినియోగదారుల కళ్ల రక్షణ కోసం యాంటి ఫ్లిక్కర్ టెక్నాలజీ సహా DC డిమ్మింగ్ సపోర్టు చేస్తుంది. మరియు తడి చేతులతో కూడా వినియోగించుకొనే విధంగా ఈ హ్యాండ్‌సెట్ రెయిన్ టచ్ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంటుంది.
50MP + 50MP + 50MP కెమెరాలు..! :
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP LYT 808 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 3X ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 50MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

6000mAh బ్యాటరీ :
ఈ వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50W మాగ్నటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 తో పనిచేస్తుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై వన్‌ప్లస్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
వన్‌ప్లస్ 13 ధర వివరాలు :
ఈ వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 31 వ తేదీన చైనాలో విడుదల కానుంది. అయితే భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారనే వివరాలను వన్‌ప్లస్ వెల్లడించలేదు. అయితే చైనాలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర CNY 4699 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.55,000) గా ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








