Home
Mobile

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో ఎప్పుడు విడుదల కానుంది..? స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ (Oneplus 13 smartphone) ఇటీవల చైనా మార్కెట్‌లో విడుదల అయింది. త్వరలో భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్లో విడుదల సిద్ధంగా ఉంది. అయితే వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌.. గత మోడళ్లతో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. డిజైన్‌ సహా స్పెసిఫికేషన్‌లు, పీచర్లలోనూ మార్పులు చేసింది. అయితే ఫోన్ ఒప్పో, వివో, షియోమీ ఫ్లాగ్‌షిప్‌ హ్యాండ్‌సెట్‌లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి.

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్లో ఎప్పుడు లాంచ్‌ కానుందనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే జనవరి 2025 లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్‌తోపాటు ఇతర మార్కెట్లలోనూ ఒకేసారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు చైనా వేరియంట్ తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే ఉంటుందని సమాచారం.

Oneplus 13 smartphone expected

వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులోకి వస్తుంది. రెండు డిజైన్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. స్లీక్‌ గ్లాస్‌ ఫినిష్‌ మరియు టెక్చ్‌‌ర్డ్‌ లెదర్‌ బ్యాక్ ప్యానల్‌తో విడుదల కానుంది. మరియు వైట్, ఒబ్సిడియన్‌, బ్లూ రంగుల్లో లభిస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్లాట్ వెనుక ప్యాన‌ల్‌ను కలిగి ఉంటుంది. మరియు 6.82 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్‌ కానుంది. కెమెరా మాడ్యూల్‌ వృత్తాకారంలోనే ఉండనుంది. అయితే కొన్ని అప్‌డేట్‌లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OxygenOS 15 తో పనిచేస్తుంది. దీంతోపాటు 4 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ IP68 మరియు IP69 రేటింగ్స్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌ అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది. అయితే మరిన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు తెలియాల్సి ఉంటుంది.

చైనా వేరియంట్ 6.82 అంగుళాల BOE X2 OLED 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా మెరుగైన విజువల్‌ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అదే 4500 గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

ఈ వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ 3nm క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మల్టీ టాస్క్‌, గేమింగ్‌ సమయంలో సౌకర్యంగా వినియోగించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 24GB ర్యామ్‌ మరియు 1TB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

వన్‌ప్లస్‌ 13 చైనా వేరియంట్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT-808, 3X ఆప్టికల్‌ జూమ్‌ సామర్థ్యంతో 50MP సోనీ LYT-600 పెరిస్కోప్‌ కెమెరా, 50MP శాంసంగ్‌ S5KJN5 అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. 100W వైర్‌ ఛార్జింగ్‌ ఫోన్‌ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి రెండు రోజులపాటు వినియోగించుకోవచ్చని సంస్థ హామీ ఇస్తోంది.

చైనా మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర 4499 యువాన్‌లుగా (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.53,111) ఉంది. అదే 24GB ర్యామ్‌ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర 5999 యువాన్‌లుగా (భారత కరెన్సీ ప్రకారం రూ.70,819) ఉంది. భారత్ మార్కెట్లో ఈ వన్‌ప్లస్‌ ప్రారంభ ధర సుమారుగా రూ.65,000 వరకు ఉంటుందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Oneplus 13 smartphone expected launch date and specifications, features full details in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X