6000mAh బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదల కానుందంటే?
వన్‌ప్లస్ నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ (Oneplus 13 Smartphone Launch) గురించి ఇటీవలే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. డిజైన్ సహా కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలపై కీలక సమాచారం విడుదల అయింది. వన్‌ప్లస్ చైనా అధిపతి లీ కీలక ప్రకటన చేశారు. విడుదల తేదీతోపాటు ఈ హ్యాండ్‌సెట్ శక్తివంతమైన చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలిపారు. ఫలితంగా రోజువారీ టాస్క్‌లతోపాటు గేమింగ్ కోసం కూడా ఈ హ్యాండ్‌సెట్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ (Oneplus Upcoming Smartphones) చైనాలో అక్టోబర్ నెలలో విడుదల కానుందని ఆ సంస్థ చైనా అధిపతి లూయిస్ లీ తెలిపారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపారు. దీని ఆధారంగా స్నా్ప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

లూయిస్ లీ పోస్ట్ ఆధారంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ చైనాలో అక్టోబర్‌లో లాంచ్ కానుంది. అయితే ఇతర వివరాలను లీ వెల్లడించలేదు. అయితే ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు లీక్ అయ్యాయి. కెమెరా డిజైన్‌లోనూ కీలక మార్పులు ఉండనున్నాయని తెలుస్తోంది. మరియు ఈ కెమెరాలు Hasselblad బ్రాండ్ తో రానున్నాయి. గత మోడల్‌తో పోలిస్తే మెరుగైన కెమెరాలతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
గత మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో విడుదల కాగా.. త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో పనిచేయనుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అధిక నాణ్యతతో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు అత్యాధునిక అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది. 6000mAh బ్యాటరీ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. గత మోడల్ 5400mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అయితే బ్యాటరీ సామర్థ్యం పెరిగిన.. గత మోడల్ తరహాలోనే బ్యాటరీ లైఫ్ ఉంటుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్ వినియోగమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల మైక్రో కర్వడ్ 2K LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ భారత్‌లో ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే చైనాలో లాంచ్ అయిన తర్వాత మాత్రమే విడుదల కానుందని తెలుస్తోంది.
ఈ సంవత్సరం జనవరి లో వన్‌ప్లస్ 12 భారత్ లో విడుదల అయింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.64,999 గా ఉంది. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే ధర రేంజ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే అప్ గ్రేడ్ ఫీచర్లు సహా ఇతర కారణాలతో ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








