Home
Mobile

OnePlus 13 : ఏకంగా 24GB ర్యామ్‌, 6000mAh బ్యాటరీ, 6.82 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వన్‌ప్లస్‌ ఫోన్ విడుదల..!

వన్‌ప్లస్‌ భారత్‌ మార్కెట్‌లో ఇవాళ వింటర్ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 13 సిరీస్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 13 మరియు వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 13 Smartphone Launched) ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా అందుబాటులోకి వచ్చింది. గత మోడల్‌తో పోలిస్తే డిజైన్ పరంగా అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ప్రీమియం డిజైన్‌తో విడుదల అయింది. మరియు శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల క్వాడ్ HD+ LTPO 4.1 ProXDR డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 510ppi పిక్సల్‌ డెన్సిటీను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ సపోర్టును కలిగి ఉంది. మరియు సిరామిక్ గార్డ్‌ రక్షణను పొందుతుంది.

Oneplus 13 smartphone price

ఏకంగా 24GB ర్యామ్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Adreno 830 GPU సహా 24GB LPDDR5X ర్యామ్, UFS 4.0 1TB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OxygenOS 15.0 ను కలిగి ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ +512GB స్టోరేజీ, 24GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది.

సూపర్‌ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ Hasselblad ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), 1/1.4 అంగుళాల 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరా, 50MP S5KJN5 అల్ట్రావైడ్‌ కెమెరా మరియు 3X జూమ్‌తో 50MP సోనీ LYT 600 పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరాను అమర్చారు.

Oneplus 13 smartphone price

భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌ అలెర్ట్‌ స్లైడర్‌ను కలిగి ఉంది. 100W వైర్‌ Supervooc ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP68 మరియు IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. నాయిస్‌ క్యాన్సిలేషన్‌, OReallity ఆడియో సపోర్టును కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, WiFi 7, Glonass, Galileo, Qzss, NavIC, NFC సహా యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్ లైట్‌, ప్రాక్సిమిటీ, కలర్‌ టెంపరేచర్ సెన్సార్‌, కంపాస్‌, గైరోస్కోప్‌, హాల్‌ సెన్సార్‌, లేజర్ ఫోకస్ సెన్సార్‌, స్పెక్రాల్‌, IR రిమోట్‌ కంట్రోల్ సెన్సార్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్‌ అల్ట్రాసోనిక్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 13 ధర, సేల్‌ వివరాలు :
వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ సేల్‌ జనవరి 10 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌, అమెజాన్‌లో లభిస్తుంది. 12GB ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.69,999 గా ఉంది. 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.76,999 గా ఉంది. 24GB ర్యామ్ వేరియంట్ ధర రూ.89,999 గా ఉంది.

ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ ధరలు వరుసగా రూ.64,999, రూ.71,999, రూ.84,999 గా ఉండనున్నాయి. బ్లాక్‌ ఎక్లిప్స్‌, మిడ్‌నైట్‌ ఓషన్‌, ఆర్కిటిక్‌ డాన్ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 13 smartphone launched with 6000mAh battery and Snapdragon 8 Elite chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X