ఇలా చేస్తే 50MP + 50MP + 50MP కెమెరాలు, 6000mAh బ్యాటరీ, అదిరిపోయే డిజైన్ కలిగిన ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్!
వన్‌ప్లస్ నుంచి భారత్ మార్కెట్‌లోకి (OnePlus India) ఇటీవల వన్‌ప్లస్ 13 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ్టి నుంచి వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ సేల్ (Oneplus 13 Smartphone sale) ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ అనేక అద్భుతమైన ఫీచర్‌లను కలిగి ఉంది. డిజైన్ ఆకట్టుకుంటోంది. మరియు మంచి కెమెరాల ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ బెస్ట్ ఆప్షన్ కానుంది.
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.69,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.76,999, రూ., 24GB ర్యామ్ + 1TB స్టోరేజీ రూ.89,999 గా ఉంది. ప్రస్తుతం వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఈ కార్డులతో రూ.5000 డిస్కౌంట్ :
తొలి సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ను ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు లేదా EMI లావాదేవీలపై రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.7000 వరకు ఎక్స్చేంజీ బోనస్‌ను పొందవచ్చు.
డిస్కౌంట్ అనంతరం ధరలు :
ఈ ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.64,999 గా ఉండనుంది. 16GB ర్యామ్ వేరియంట్‌ను రూ.71,999 మరియు 24GB ర్యామ్ వేరియంట్‌ను రూ.84999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ ఆర్కిటిక్ డాన్, మిడ్‌నైట్ ఓషన్, బ్లాక్ ఎక్లిప్స్ రంగుల్లో లభిస్తుంది.

వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల క్వాడ్ HD+ LTPO 4.1 ProXDR డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 510ppi పిక్సల్స్ డెన్సిటీని కలిగి ఉంది. మరియు డాల్బీ విజన్ సపోర్టు సహా సిరామిక్ గార్డ్ రక్షణ పొందుతుంది.
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 OxygenOS 15.0 తో పనిచేస్తుంది. మరియు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ Adreno 830 GPU, గరిష్ఠంగా 24GB LPDDR5X ర్యామ్, UFS 4.0 1TB స్టోరేజీతో జతచేసి ఉంది.
50MP + 50MP + 50MP కెమెరాలు :
కాస్త ధర ఎక్కువైనా మంచి కెమెరాలు కలిగిన ఫోన్‌ను కావాలని భావించే వారికి వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Hasselblad ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్టుతో (OIS) 50MP సోనీ LYT 808 కెమెరా, 50MP S5KJN5 అల్ట్రావైడ్ లెన్స్ ను కలిగి ఉంది.
వీటితోపాటు 3X జూమింగ్ సామర్థ్యంతో 50MP సోనీ LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 32MP సోనీ IMX615 కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 100W వైర్ Supervooc ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, WiFi 7 వంటి కనెక్టివిటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఫోన్ భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్, OReallity ఆడియో సపోర్టు సహా IR రిమోట్ కంట్రోల్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








