మంచి కెమెరాల స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఈ OnePlus ఫోన్ గురించి తెలుసుకోండి..?
వన్‌ప్లస్ నుంచి భారత్ మార్కెట్ లోకి ఈ నెల 7 వ తేదీన వన్‌ప్లస్ 13 సిరీస్ (Oneplus 13 Series) స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13 మరియు వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇదే ఈవెంట్ లో మరికొన్ని గ్యాడ్జెట్‌లు కూడా విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఇటీవల చైనాలో విడుదల అయిన వన్‌ప్లస్ Ace 5 కు రీబ్రాండెడ్ వెర్షన్ గా వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్ లాంచ్ కానుందని భావించారు. అయితే ఈ రెండింటి మధ్య అనేక మార్పులు ఉన్నట్లు తాజా లీక్స్ ఆధారంగా తెలుస్తోంది.
50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరా :
ప్రధానంగా వన్‌ప్లస్ Ace 5, వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ ల (Oneplus 13R Smartphone) మధ్య కెమెరా విభాగం పరంగా కీలక మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్ 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు 2X ఆప్టికల్ జూమ్‌తో 50MP శాంసంగ్ ISOCELL JN5 టెలిఫోటో కెమెరా సహా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే లైఫ్‌లైం వారంటీని కలిగి ఉంటుంది. గ్రీన్ లైన్ సమస్య కారణంగా వన్‌ప్లస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 8T LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ డిస్‌ప్లే, 2160Hz PWM డిమ్మింగ్ తో అందుబాటులోకి వస్తుందని సమాచారం. మరియు ఒప్పో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.
OnePlus 13R camera info
— Yogesh Brar (@heyitsyogesh) December 31, 2024
Rear:
- 50MP LYT-700 (main)
- 8MP Ultrawide
- 50MP JN5 (2X Telephoto)
Selfie: 16MP
Indian model gets:
- 12GB/256GB
- 16GB/512GB
(LPDDR5X / UFS4.0)
Thoughts on the pricing?
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Adreno 750 GPU చిప్‌సెట్‌తో జతచేసి ఉంటుంది. ఈ ప్రాసెసర్ 16GB LPDDR5X ర్యా్మ్ మరియు 1TB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ అంచనా వివరాలు :
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. Hasselblad తో కూడిన కెమెరాలను కలిగి ఉంటుంది. మూడు 50MP OIS ప్రైమరీ, టెలిఫోటో, అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది.
భారత్ మార్కెట్ లో వన్‌ప్లస్ 13 సిరీస్ విడుదల కార్యక్రమం జనవరి 7 వ తేదీన 9.30 PM గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ను వన్‌ప్లస్ యూట్యూబ్ ఛానల్‌తోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలోనూ లైవ్ చూడవచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇతర గ్యాడ్జెట్ లు కూడా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








