Home
Mobile

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల కీలక వివరాలు..!

వన్‌ప్లస్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి త్వరలో 13 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు వేరియంట్‌లు వన్‌ప్లస్‌ వింటర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో భాగంగా భారత్‌లో జనవరి 7 వ తేదీన లాంచ్‌ (OnePlus 13R Smartphone india Launch Date) కానున్నాయి. అమెజాన్‌ ద్వారా లభించనున్నాయి. ఇప్పటికే అమెజాన్‌ లిస్టింగ్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ల డిజైన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి.

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. వన్‌ప్లస్‌ 13R హ్యాండ్‌సెట్‌ చైనాలో Ace 5 పేరుతో లాంచ్‌ అవుతోంది. అయితే వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా వన్‌ప్లస్‌ 13R వివరాలు లీక్‌ అవుతున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్‌ 12R హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

OnePlus 13R Smartphone chepset

అమెజాన్‌ ద్వారా వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌ కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. సుమారుగా వన్‌ప్లస్‌ 12R తరహా డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆస్ట్ర్‌ టైల్‌, నైబ్యూలా నోయిర్‌ షేడ్‌ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం.

తాజాగా వెల్లడైన వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ (OnePlus 13R Chipset) స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఏఐ ఇమేజింగ్ పవర్, ఏఐ నోట్స్‌, ఇంటెలిజెంట్‌ సెర్చ్‌ వంటి AI ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

OnePlus 13R Smartphone chepset

కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ సహా 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌తో 6.82 అంగుళాల 2K 8T LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి రానుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 50W వైర్‌లెస్‌, 100W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్టు, మాగ్నటిక్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్‌ 13 కెమెరా విభాగం పరంగా Hasselblad ఆధారిత ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరా (OIS), 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 3X ఆప్టికల్ జూమింగ్‌ సామర్థ్యంతో 50MP పెరిస్కోప్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ వింటర్‌ లాంచ్‌ ఈవెంట్ భారత్‌లో జనవరి 7 వ తేదీ 9:30 PM గంటలకు ప్రారంభం కానుంది. వన్‌ప్లస్‌ యూట్యూబ్‌ ఛానల్, అధికారిక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌ ను వీక్షించవచ్చు. అయితే వన్‌ప్లస్‌ 13, వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ల మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 13R Smartphone confirmed to launch with Snapdragon 8 Gen 3 SoC Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X