Home
Mobile

6000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలు, 6.78 అంగుళాల డిస్‌ప్లే వన్‌ప్లస్ 13R ఫోన్ పై రూ.5000 వరకు తగ్గింపు..!

వన్‌ప్లస్‌ ఈ సంవత్సరం జనవరిలో వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్ (Oneplus 13R) లాంచ్ అయింది. ఈ ఫోన్ డిజైన్ సహా ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌ల పరంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది.

ధర, డిస్కౌంట్ వివరాలు :
వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 12GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.42,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,215 కే కొనుగోలు చేయవచ్చు.

Oneplus 13R Smartphone

ఈ ఫోన్‌ 16GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.49,999 కి లాంచ్ అయింది. ప్రస్తుతం రూ.44,542 కు కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ఆస్ట్రల్‌ ట్రైల్‌, నెబ్యూలా నోయిర్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

చిప్‌సెట్, OS చిప్‌సెట్ వివరాలు :
వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OxygenOS 15.0, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 450 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 2X ఆప్టికల్ జూమ్‌తో 50MP S5KJN5 టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

భారీ బ్యాటరీ :
వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, NFC వంటి ఫీచర్‌లు సహా IR ను కూడా కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్ లైట్‌ సెన్సార్‌, లేజర్ ఫోకస్ సెన్సార్‌, ప్రాక్సిమిటీ, కలర్‌ టెంపరేచర్ సెన్సార్‌, కంపాస్‌, గైరోస్కోప్‌, హాల్‌ సెన్సార్‌ లతోపాటు భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Oneplus 13R Smartphone Get upto Rs5000 price discount on flipkart in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X