Home
Mobile

OnePlus 13R : 50MP + 50MP కెమెరాలు, 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో ఫోన్‌ విడుదల..!

భారత్‌ మార్కెట్‌లో ఇవాళ వన్‌ప్లస్‌ వింటర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. వన్‌ప్లస్‌ 13 మరియు వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వన్‌ప్లస్ 13 ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా విడుదల అయింది. అదే 13R మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 13R Smartphone Launched) మిడ్‌రేంజ్‌ ధరలో అందుబాటులోకి వచ్చింది. అయితే అనేక ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల పుల్‌ HD+ (1264*2780) LTPO డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 450ppi పిక్సల్‌ డెన్సిటీను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ 7i రక్షణను పొందుతుంది.

oneplus 13R smartphone launched

16GB ర్యామ్‌ : ఈ వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OxygenOS 15.0 ను కలిగి ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్లో అందుబాటులో ఉంది.

రెండు 50MP కెమెరాలు : ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), 1/1.56 అంగుళాల 50MP సోనీ LYT-700 కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP S5KJN5 టెలిఫోటో కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.

6000mAh బ్యాటరీ : ఈ ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ మూడు మైక్రో ఫోన్‌లు సహా OReality ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, WiFi 7, Glonass, Galileo, Qzss, NavIC, NFC సహా యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్ లైట్‌, ప్రాక్సిమిటీ, కలర్‌ టెంపరేచర్ సెన్సార్‌, కంపాస్‌, గైరోస్కోప్‌, హాల్‌ సెన్సార్‌, లేజర్ ఫోకస్ సెన్సార్‌, స్పెక్రాల్‌, IR రిమోట్‌ కంట్రోల్ సెన్సార్‌లను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ ఫోన్‌ జనవరి 13 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్‌లో లభిస్తుంది. 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.42,999 గా ఉంది. 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది.

ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా (OnePlus 13R Smartphone Sale) కొనుగోలు చేస్తే రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ధరలు రూ.39,999, రూ.46,999 గా ఉండనున్నాయి. ఆస్ట్రల్‌ ట్రైల్, నెబ్యులా నోయిర్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
oneplus 13R smartphone launched with 6000mAh battery and Snapdragon 8 gen 3 Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X