6300mAh భారీ బ్యాటరీ, 6.78 అంగుళాల 1.5K డిస్‌ప్లేతో OnePlus స్మార్ట్‌ఫోన్.. విడుదల వివరాలు లీక్..!!
వన్‌ప్లస్ (OnePlus India) నుంచి త్వరలో రెండు స్మార్ట్‌ఫోన్ లు విడుదల కానున్నాయి. వన్‌ప్లస్ 13, 13R స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో లాంచ్ కానున్నాయి. ఇటీవల వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ (OnePlus 13R Smartphone) అనేక సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లలో కనిపించింది. ఫలితంగా విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు లీక్ అవుతున్నాయి. 1.5K రిజల్యూషన్ తో కూడిన డిస్‌ప్లే సహా భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ తో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ గుర్తించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పూర్తి వివరాలు మీకోసం.
వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్ తొలుత చైనా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. అయితే చైనాలో వన్‌ప్లస్ Ace 5 పేరుతో లాంచ్ కానుంది. గత సంవత్సరం భారత్‌లో వన్‌ప్లస్ 12, 12R స్మార్ట్‌ఫోన్‌లు జనవరి నెలలో ఒకేసారి విడుదల అయ్యాయి. ఈ తరహాలోనే వన్‌ప్లస్ 13, 13R హ్యాండ్‌సెట్‌లు కూడా లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. వన్‌ప్లస్ 13 తో పోలిస్తే 13R స్మార్ట్‌ఫోన్ పెద్ద బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ 13R హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు లీక్ అయ్యాయి. దీని ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. 6.78 అంగాళాల BOE X2 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
50MP ప్రైమరీ కెమెరా! :
ఈ 13R స్మార్ట్‌ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరో కెమెరాల వివరాలు తెలియాల్సి ఉంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.
భారీ బ్యాటరీ సహా ఫాస్ట్ ఛార్జింగ్ :
హెవీ యూజర్లుకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా భారీ బ్యాటరీలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6300mAh బ్యాటరీతో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2025 జనవరిలో లాంచ్ కానుందని భావిస్తున్నారు.
ఇటీవలే వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఫోరమ్ (GCF) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లోనూ విడుదల సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీంతోపాటు మరో నివేదిక ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 2G GSM, 3G WCDMA, 4G LTE FDD, 4G LTE TDD మరియు 5G నెట్‌వర్క్‌లను సపోర్టు చేస్తుంది.
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ (OnePlus 13 Smartphone) స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 100W వైర్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా 2025 జనవరి నెలలో విడుదల కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








