Home
Mobile

బెస్ట్‌ ప్రాసెసర్‌, కెమెరాలు, భారీ డిస్‌ప్లే ఫోన్‌ కోసం చూస్తున్నారా.. రేపటి నుంచి ఈ ఫోన్‌ కొనుగోలు చేయవచ్చు..

వన్‌ప్లస్‌ నుంచి ఇటీవల భారత్‌ మార్కెట్‌ లోకి (OnePlus India) వన్‌ప్లస్ 13 సిరీస్‌ విడుదల అయింది. ఇందులో భాగంగా వన్‌ప్లస్‌ 13, 13R ఫోన్‌ లు లాంచ్‌ అయ్యాయి. జనవరి 10 నుంచి వన్‌ప్లస్‌ 13 ఫోన్ సేల్‌ ప్రారంభం అయింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 13R ఫోన్‌ సేల్‌ (OnePlus 13R Smartphone Sale) ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) సహా అనేక సూపర్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. 6000mAh భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లు, సేల్ పూర్తి వివరాలు.

వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.49,999 గా ఉంది. ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు రూ.4000 ఎక్స్చేంజీ బోనస్‌ ను పొందవచ్చు. వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ (Amazon) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ నెబ్యులా నోయిర్, ఆస్ట్రల్‌ ట్రైల్ రంగుల్లో లభిస్తుంది.

oneplus 13r

వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
వన్‌ప్లస్‌ 13R హ్యాండ్‌సెట్‌ 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌ తో 6.78 అంగుళాల FHD+ LTPO డిస్‌ప్లే తో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 1264*2780 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 450ppi పిక్సల్‌ డెన్సిటీను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ 7i రక్షణ ను కలిగి ఉంటుంది.

ప్రాసెసర్‌, OS, బ్యాటరీ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OxygenOS 15.0 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. రెండు స్టోరేజీ వేరియంట్‌ లలో లభిస్తుంది. ఈ ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ తో 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ ను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమింగ్‌ సామర్థ్యంతో 50MP S5KJN5 టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

IP65 రేటింగ్‌ :
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi 7, బ్లూటూత్‌ 5.4, Glonass, Galileo, Qzss, NavIC, NFC ఫీచర్‌లున్నాయి. మరియు యాంబియంట్ లైట్‌, యాక్సెలిరోమీటర్‌, ప్రాక్సిమిటీ, కలర్‌ టెంపరేచర్ సెన్సార్‌, లేజర్ ఫోకస్, కంపాస్‌, గైరోస్కోప్‌, హాల్‌ సెన్సార్‌, IR రిమోట్‌ కంట్రోల్ సెన్సార్‌ లను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 13R smartphone sale to start from tomorrow on amazon check price and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X