Home
Mobile

50MP + 50MP కెమెరాలు, 6000mAh బ్యాటరీ, FHD+ డిస్‌ప్లే OnePlus 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్‌!

వన్‌ప్లస్ నుంచి గత డిసెంబర్‌ లో వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు 7400mAh బ్యాటరీ, 6.83 అంగుళాల డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.47999 గా ఉంది. అయితే గత సంవత్సరం ప్రారంభంలో లాంచ్‌ అయిన వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 13R Smartphone) వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌ లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ ధర రూ.49,999 గా ఉంది.

Oneplus 13R smartphone

మొత్తంగా రూ.5 వేల తగ్గింపు :
ప్రస్తుతం అమెజాన్‌ లో 12GB/256GB ధర రూ.39,999, 16GB/512GB ధర రూ.46,999 గా ఉంది. అంటే రూ.3 వేల తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. విడుదల ధరతో పోలిస్తే మొత్తంగా రూ.5 వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది.

FHD+ డిస్‌ప్లే :
వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.78 అంగుళాల FHD+ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ నెబ్యూలా నెయిర్‌, ఆస్ట్రల్‌ ‌ట్రైల్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Oneplus 13R smartphone

స్నాప్‌డ్రాగన్ చిప్‌, 6000mAh బ్యాటరీ :
ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తోంది. అనేక AI ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP65 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

కెమెరా విభాగం వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) తో 50MP సోనీ LYT 700 కెమెరా ఉంది. 2x ఆప్టికల్ జూమ్‌ తో 50MP టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్ లెన్స్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరా ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, Wi-Fi 7, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. గైరోస్కోప్‌, హాల్‌ సెన్సర్‌, కలర్‌ టెంపరేచర్‌ సెన్సర్‌, ప్రాక్సిమిటీ, యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, IR రిమోట్‌ కంట్రోల్‌ సెన్సర్‌ ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది.

త్వరలో వన్‌ప్లస్ నుంచి భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని లీక్స్ వస్తున్నాయి. అయితే వన్‌ప్లస్‌ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నార్డ్‌ సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 13R smartphone with snapdragon 8 gen 3 chip now available with rs5000 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X