Home
Mobile

OnePlus 13s Smartphone : వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు లీక్‌.. కలర్‌ వేరియంట్స్ టీజర్‌ విడుదల...!

వన్‌ప్లస్‌ 13T స్మార్ట్‌ఫోన్ ఇటీవల చైనా మార్కెట్‌లో లాంచ్‌ అయింది. భారత్‌ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ వన్‌ప్లస్‌ 13s పేరుతో (OnePlus 13s) విడుదల కానుంది. అయితే కచ్చితమైన విడుదల తేదీని వన్‌ప్లస్‌ వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ గురించి అనేక కీలక వివరాలను వెల్లడిస్తోంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు వివరాలు లీక్‌ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ అంచనా ధర వివరాలు లీక్‌ అయ్యాయి.

ప్లస్‌ కీ బటన్‌ :
వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేక డిజైన్‌తో విడుదల కానుంది. ఈ ఫోన్‌ ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు పంచ్‌ హోల్‌ కెమెరా డిజైన్‌తో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్ కుడి వైపున పవర్‌, వాల్యూమ్‌ బటన్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ప్లస్‌ కీ (Plus Key) పేరుతో కస్టమైజబుల్‌ బటన్‌ను కలిగి ఉంది.

Oneplus 13s smartphone colour variants teased a

ఈ ప్లస్‌ కీ బటన్‌ ద్వారా సైలెంట్, వైబ్రేషన్‌, రింగ్‌ మోడ్‌ పరస్పరం మార్చుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు ఈ బటన్‌ను కెమెరా, ఫ్లాష్‌ లైట్‌ నియంత్రణ కోసం ఉపయోగించుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ బటన్ ఐఫోన్‌ యాక్షన్‌ బటన్‌గా పనిచేస్తుంది.

మూడు కలర్‌ వేరియంట్స్‌ :
దీంతోపాటు వెనుక వైపు ఈ ఫోన్‌ గ్లాస్‌ ఫినిష్‌ను ను కలిగి ఉంటుంది. మరియు స్లీక్‌ మెటాలిక్‌ కెమెరా ఐలాండ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్‌ మూడు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది. సంస్థ తాజాగా విడుదల చేసిన టీజర్‌ ఆధారంగా ఈ ఫోన్ బ్లాక్‌, గ్రీన్‌, పింక్‌ రంగుల్లో లభిస్తుంది.

వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ అంచనా ధర వివరాలు :
వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ అమెరికాలో $649 గా ఉంటుందని భావిస్తున్నారు. అదే UAE లో AED 2100 గా ఉండనుంది. భారత్‌ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధర సుమారుగా రూ.50,000 గా ఉంటుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్‌ 13s స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.32 అంగుళాల ఫ్లాట్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 2640 x 1216 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ LPDDR5x ర్యామ్, UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మల్టీ టాస్కింగ్‌, గేమింగ్‌ సమయాల్లో ఈ ఫోన్‌ మెరుగైన పనితీరు అందిస్తుందని వన్‌ప్లస్ చెబుతోంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

* చైనా మార్కె్ట్‌లో మే 14 వ తేదీన వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2 ప్రో విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్‌ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ప్యాడ్‌ 12,140mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 13.2 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక వైపు 13MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ భారత్‌లో విడుదల కానుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 13s smartphone colour variants teased and price leaked in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X