Home
Mobile

వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ కలర్‌ వేరియంట్స్‌ విడుదల.. ఇతర స్పెసిఫికేషన్‌లు, లాంచ్‌ వివరాలు..!

OnePlus 13s Smartphone: వన్‌ప్లస్‌ నుంచి ఇటీవల చైనా మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 13T స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 13s పేరుతో లాంచ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను కూడా వన్‌ప్లస్‌ ఇండియా విడుదల చేసింది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తామనే వివరాలను వెల్లడించలేదు. అయితే డిస్‌ప్లే డిజైన్‌ వివరాలు వెల్లడ‌య్యాయి. అయితే తాజా సంస్థ విడుదల చేసిన టీజర్‌ ఆధారంగా ఈ ఫోన్‌ రెండు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది.

భారత్‌లో రెండు కలర్ వేరియంట్స్‌లో :
చైనాలో ఈ ఫోన్‌ మూడు కలర్‌ వేరియంట్స్‌ లాంచ్ అయింది. అయితే భారత్‌ కేవలం బ్లాక్‌, పింక్ రంగుల్లోనే లభించనుంది. చైనా వేరియంట్‌ తరహాలోనే స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ హోల్‌ పంచ్‌ డిస్‌ప్లే డిజైన్‌తో అందుబాటులోకి రానుంది.

OnePlus 13s Smartphone Colour Variants teased in india expected to launch in may 2025

స్లిమ్‌ బెజెల్స్‌, కెమెరా మాడ్యూల్‌ :
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్‌ స్లిమ్‌ బెజెల్స్‌ తో కూడిన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు యూనిక్‌ డ్యూయల్‌ కెమెరా మాడ్యూల్‌ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.32 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్‌ కానుంది. వన్‌ప్లస్‌ ఇండియా మరియు అమెజాన్‌ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

శక్తివంతమైన చిప్‌సెట్ :
వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోన్‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు విడుదల తేదీ వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉన్నాయి.

6000mAh బ్యాటరీ :
వన్‌ప్లస్‌ 13s హ్యాండ్‌సెట్‌ 90W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

చైనా వేరియంట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్‌ 13T (చైనా వేరియంట్) స్మార్ట్‌ఫోన్‌ 6.32 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. రెండు 50MP కెమెరాలతోపాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

చైనాలో వన్‌ప్లస్‌ 13T ప్రారంభ ధర CNY 3399 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.39,000) గా ఉంది. భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.45 వేలుగా ఉండే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 13s హ్యాండ్‌సెట్‌ ఈ నెలలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లాంచ్ అనంతరం వన్‌ప్లస్ ఇండియా, అమెజాన్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. మిడ్‌ రేంజ్‌ యూజర్లకు ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 13s Smartphone Colour Variants teased in india expected to launch in may 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X