రూ.4 వేల డిస్కౌంట్.. శక్తివంతమైన ప్రాసెసర్, 50MP టెలిఫోటో కెమెరా, ప్లస్ కీ సహా సూపర్ ఫీచర్లు..!
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ (OnePlus 13s Smartphone pricedrop) ఈ సంవత్సరం జున్ నెలలో భారత్‌లో విడుదల అయింది. ప్రీమియం కంపాక్ట్ మోడల్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite శక్తివంతమైన చిప్‌సెట్ ను కలిగి ఉంది. మరియు రెండు 50MP కెమెరాలను కలిగి ఉంది. మరియు ప్లస్ కీ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.
రూ.4 వేల డిస్కౌంట్ :
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999 గా ఉండేది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో (Amazon Great indian Festival 2025) భాగంగా రూ.4 వేల డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.

అంటే ప్రస్తుతం 12GB/256GB ధర రూ.50,999, 12GB/512GB ధర రూ.55,999 గా ఉంది. దీంతోపాటు అమెజాన్‌లో SBI కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ గ్రీన్ సిల్క్, బ్లాక్ వెల్‌వెట్, పింక్ శాటిన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ ప్రీమియం కంపాక్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్ 6.32 అంగుళాల 1.5K LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్, HDR10+, HDR Vivid సపోర్టు చేస్తుంది.
ప్లస్ కీ :
ఈ వన్‌ప్లస్ ఫోన్ ఆక్వా టచ్ 2.0, Glove మోడ్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులు, గ్లౌజ్‌లతో కూడా ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్ Plus Key ని కలిగి ఉంది. ఈ బటన్ ద్వారా AI ప్లస్ మైండ్ స్పేస్‌ను లాంచ్ చేయవచ్చు. లాంగ్ ప్రెస్ టేసి.. సైలెంట్, వైబ్రేట్, రింగ్ మోడ్స్ నుంచి పరస్పరం మార్చుకోవచ్చు.

శక్తివంతమైన చిప్‌సెట్ :
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Oxygen OS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 4 OS అప్‌డేట్స్, 6 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని వన్‌ప్లస్ హామీ ఇచ్చింది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టుతో 50MP టెలిఫోటో కెమెరాలతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 80W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5850mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








