భారత్ మార్కెట్‌లోకి OnePlus నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. ఆకట్టుకొనే డిజైన్ సహా కీలక వివరాలు లీక్..
భారత్‌లో వన్‌ప్లస్ కొత్త ఫోన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. తాజాగా సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వన్‌ప్లస్ కీలక ప్రకటన చేసింది. వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో త్వరలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల విడుదల అయిన వన్‌ప్లస్ 13T స్మార్ట్‌ఫోన్.. భారత్‌లో 13s గా (OnePlus 13s Smartphone India Launch) అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందనే కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు.
బ్యాక్ ప్యానల్ డిజైన్ :
అయితే వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ డిజైన్ విడుదల అయింది. ఇందులో కెమెరా మాడ్యూల్, పవర్, వాల్యూమ్ బటన్లను గుర్తించవచ్చు. ఈ ఫోన్ అమెజాన్ ద్వారా భారత్‌లో సేల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మైక్రోసైట్ కూడా ప్రారంభం అయింది.

శక్తివంతమైన చిప్‌సెట్‌తో :
అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా భారత్‌లో త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ చిప్‌సెట్ (Snapdragon 8 Elite) తో పనిచేస్తుంది. కెమెరాలు, స్టోరేజీ వేరియంట్స్ సహా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు.
డిస్‌ప్లే వివరాలు :
అయితే ఈ ఫోన్ 6.32 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2640x1216 పిక్సల్స్ రిజల్యూషన్, 460ppi పిక్సల్ డెన్సిటీను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఈ డిస్‌ప్లే 10 బిట్ కలర్ డెప్త్, DCI P3 కలర్ కవరేజ్, HDR10+, HDR Vivid, డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ఆధారిత Oxygen OS 15 తో పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుందో తెలియాల్సి ఉంది.
కెమెరా విభాగం పరంగా డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ LYT-700 ప్రైమరీ సెన్సార్, 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
A synergy of power and proportion. Coming soon. #OnePlus13s
— OnePlus India (@OnePlus_IN) April 28, 2025
Know more: https://t.co/vGl4VNimgR pic.twitter.com/eKScQQoCtr
ఈ స్మార్ట్‌ఫోన్ 6260mAh బ్యాటరీతో విడుదల కానుందని తెలుస్తోంది. మరియు 80W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. అయితే భారీ బ్యాటరీని కలిగి ఉంటున్నా.. కేవలం 185 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
భారీ బ్యాటరీతో మరో ఫోన్ కూడా :
వన్‌ప్లస్ 13s తోపాటు త్వరలో వన్‌ప్లస్ నుంచి నార్డ్ CE 5 హ్యాండ్‌సెట్ కూడా విడుదల కానుంది. ఈ ఫోన్ ఏకంగా 7100mAh బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది. మే నెలలో ఈ ఫోన్ విడుదల కానుందని సమాచారం. రూ.25000 వేల ధర సెగ్మెంట్‌లో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
గతంలో లీక్ అయిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. భారీ బ్యాటరీతో విడుదల అవుతున్నా.. స్లి్‌మ్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications







