OnePlus 13s స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడి.. జీవితకాలం డిస్‌ప్లే వారంటీ, శక్తివంతమైన చిప్‌సెట్ సహా..!
OnePlus 13s Smartphone : వన్‌ప్లస్ నుంచి భారత్ మార్కెట్‌లోకి త్వరలో 13s స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ గురించి అనేక వివరాలను వన్‌ప్లస్ అందిస్తోంది. ఇటీవలే ఈ ఫోన్ కలర్ వేరియంట్స్‌ను వన్‌ప్లస్ వెల్లడించింది. అయితే ధర వివరాలు లీక్ అయ్యాయి. తాజాగా వన్‌ప్లస్ మరో కీలక ప్రకటన చేసింది. ఈ వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 6.32 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ఎప్పుడు లాంచ్ కానుంది? :
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. భారత్ మార్కెట్‌లో జూన్ 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విడుదల కానుంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

జీవిత కాలం డిస్‌ప్లే వారంటీ :
తాజాగా వన్‌ప్లస్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ కోసం లైఫ్ టైమ్ డిస్‌ప్లే వారంటీని అందిస్తామని తెలిపింది. తాజాగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. గ్రీన్ లైన్ సమస్య తలెత్తిన డిస్‌ప్లేలకు ఈ వారంటీ వర్తిస్తుందని చెప్పింది. ఇతర కారణాలతో డ్యామేజీ అయితే ఈ వారంటీ వర్తించదని వన్‌ప్లస్ స్పష్టం చేసింది.
మూడు కలర్ వేరియంట్స్ :
వన్‌ప్లస్ 13s హ్యాండ్‌సెట్ బ్లాక్, గ్రీన్, పింక్ రంగుల్లో లభిస్తుందని గత వారం విడుదల చేసిన టీజర్ ఆధారంగా వన్‌ప్లస్ వెల్లడించింది. మరియు ఈ వెనుక వైపు ఈ ఫోన్ గ్లాస్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. మరియు స్లీక్ మెటాలిక్ కెమెరా ఐలాండ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. చైనాలో విడుదల అయిన వన్‌ప్లస్ 13T స్మార్ట్‌ఫోన్.. భారత్‌లో 13s గా రానుంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్ 6.32 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 2640 x 1216 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మరియు HDR10+, డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. మరియు పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
ఐఫోన్‌లోని యాక్షన్ బటన్ తరహాలో! :
ఈ ఫోన్ కుడి వైపున పవర్, వాల్యూమ్ బటన్‌లను కలిగి ఉంది. దీంతోపాటు 'ప్లస్ కీ' పేరుతో కస్టమైజబుల్ బటన్‌తో లాంచ్ అవుతుంది. ఐఫోన్‌లోని యాక్షన్ బటన్ తరహాలో పనిచేస్తుంది. ఈ ప్లస్ కీ బటన్ సైలెంట్, వైబ్రేషన్, రింగ్ మోడ్ నుంచి పరస్పరం మార్చుకొనేందుకు అవకాశం ఉంది. కెమెరా, ఫ్లాష్ లైట్ ను కూడా ఆపరేట్ చేయవచ్చు.
శక్తివంతమైన చిప్‌సెట్ :
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరా (OIS), 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
ఇటీవలే ఈ వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్ ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ అమెరికాలో $649 గా ఉంటుందని తెలుస్తోంది. అదే UAE లో AED 2100 గా ఉండనుంది. భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.50,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








