OnePlus 13s స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. 50MP + 50MP కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ సహా..!!
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ (Oneplus 13s Smartphone Launch) భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్ కాంపాక్ట్ మోడల్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఫలితంగా మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ మెరుగైన వైఫై కనెక్టివిటీ కోసం ప్రత్యేక చిప్‌ను కలిగి ఉంది. 80W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. మూడు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచే ప్రీ బుకింగ్‌కు అవకాశం కల్పించింది.
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ 6.32 అంగుళాల 1.5K LTPO ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160PWM డిమ్మింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+ సపోర్టును కలిగి ఉంటుంది. ఆక్వా టచ్ 2.0 టెక్నాలజీ, Glove మోడ్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి, గ్లౌజ్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చు.

స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ :
ఈ వన్‌ప్లస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Oxygen OS 15 ను కలిగి ఉంది.
ప్రత్యేకంగా ప్లస్ కీ :
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా ప్లస్ కీ (Plus Key) ను కలిగి ఉంది. ఈ కీ ని లాంగ్ ప్రెస్ చేస్తే రింగ్, వైబ్రేట్, సైలెంట్ మోడ్స్ నుంచి పరస్పరం మార్చుకొనేందుకు వీలుంటుంది. దీంతోపాటు కెమెరా, ఫ్లాష్ లైట్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లస్ కీతో AI ప్లస్ మైండ్ స్పేస్‌ను లాంచ్ చేయవచ్చు. ఈ మైండ్ స్పేస్ ద్వారా యూజర్లు ఆర్టికల్స్, చాట్స్, ఫోటోలు, షెడ్యూల్స్‌ను సేవ్ చేసుకోవచ్చు.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2x ఆప్టికల్ జూమ్, f/2.0 అపేచర్, EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP S5KJN5 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. f/2.0 అపేచర్, EIS సపోర్టుతో 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

దీంతోపాటు ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో AI Unblur, AI Reflection Eraser, AI Reframe, AI Detail Boost వంటి ఫీచర్‌లున్నాయి. దీంతోపాటు గూగుల్ సర్కిల్ టూ సెర్చ్, AI సెర్చ్, AI కాల్ అసిస్టెంట్, AI వాయిస్ స్క్రైబ్, AI ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్‌లను కూడా సపోర్టు చేస్తుంది.
బ్యాటరీ పరంగా ఈ వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ 80W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5850mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ స్థిరమైన వైఫై కనెక్టివిటీ కోసం G1 వైఫై చిప్‌సెట్ కూడా కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G. 4G, బ్లూటూత్ 6.0, వైఫై 7, NFC, GPS వంటి ఫీచర్‌లున్నాయి.
Stronger. Smarter. Smaller. The #OnePlus13s is here.
— OnePlus India (@OnePlus_IN) June 5, 2025
Pre-order now: https://t.co/wPkrNOw1NF pic.twitter.com/3u1tE9DT7E
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ ధర సేల్ వివరాలు :
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఈ ఫోన్ సేల్ జూన్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చని వన్‌ప్లస్ తెలిపింది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ గ్రీన్ సిల్క్, బ్లాక్ వెల్‌వెట్, పింక్ శాటిన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఇవాళ్టి నుంచి ఈ ఫోన్‌ను రూ.1999 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ప్రీ బుకింగ్ చేసుకున్నవారు వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 తోపాటు లైఫ్‌టైం డిస్‌ప్లే వారంటీ, 3 సంవత్సరాల బ్యాటరీ ప్రొటెక్షన్ ప్లాన్, 180 రోజుల ఫోన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications