రేపే వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్, ప్లస్ కీ సహా కీలక ఫీచర్‌లు..!
OnePlus 13s Smartphone Launch : వన్‌ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ రేపు భారత్ మార్కెట్ లో విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. వన్‌ప్లస్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్ వీక్షించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్లస్ కీ (OnePlus Plus Key) తోపాటు అనేక AI ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇప్పటికే వచ్చిన లీక్స్ ఆధారంగా ఈ ఫోన్ సుమారు రూ.55000 గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా ను కలిగి ఉంటుంది.
సేల్ ఎక్కడ ప్రారంభం కానుంది..? :
వన్‌ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ విడుదల అనంతరం వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సహా ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ గ్రీన్ సిల్క్, పింక్ సాటిన్, బ్లాక్ వెల్‌వెట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.

డిస్‌ప్లే, ప్లస్ కీ :
ఇప్పటికే వన్‌ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 6.32 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ ఫ్లస్ కీ కూడా కలిగి ఉంటుంది. ఈ ప్లస్ కీ అనేక విధాలుగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది.
శక్తివంతమైన చిప్‌సెట్ :
ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంటుంది. వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత చిప్‌సెట్ ను కలిగి ఉంది. నాలుగు OS అప్‌డేట్స్ పొందుతుందని తెలుస్తోంది.
50MP ప్రైమరీ కెమెరా :
ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఆటోఫోకస్ సామర్థ్యంతో 32MP కెమెరాను కలిగి ఉంటుంది. అయితే వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అయితే ఈ కెమెరా వివరాలు వెల్లడి కాలేదు. అయితే 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. రేపు పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
8.15mm ప్రొఫైల్ :
అయితే బ్యాటరీ మరియు ఛార్జింగ్ పరంగా ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే 6260mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 8.15mm ప్రొఫైల్ తో 185 గ్రాములు బరువు ఉంటుంది. ఏఐ పరంగా కాల్ అసిస్టెంట్, AI ట్రాన్స్‌లేషన్, వాయిస్ స్క్రైబ్ వంటి AI ఫీచర్‌లుంటాయి.
కనెక్టివిటీ పరంగా వన్‌ప్లస్ 13s హ్యాండ్‌సెట్ G1 Wi-Fi చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 5.5G నెట్‌వర్క్ ను సపోర్టు చేస్తుంది. IP65 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications