వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్.. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్, 6.32 అంగుళాల డిస్‌ప్లే సహా!
OnePlus 13s Smartphone : వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో జూన్ 5 వ తేదీన లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ కాంపాక్ట్ వెర్షన్‌గా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 6.32 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు ప్లస్ కీ తో లాంచ్ కానుంది.
ధర వివరాలు లీక్ :
అయితే తాజాగా వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్ అయ్యాయి. 91మొబైల్స్ భాగస్వామ్యంతో టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఈ వివరాలు వెల్లడించారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.55000 గా ఉంటుంది. అయితే ర్యామ్, స్టోరేజీ వివరాలు వెల్లడి కాలేదు. భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

డిస్‌ప్లే వివరాలు :
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ 6.32 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 2640 x 1216 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. HDR10+, డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది. పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
లైఫ్ టైం డిస్‌ప్లే వారంటీ :
ఈ ఫోన్ డిస్‌ప్లే కోసం లైఫ్ టైం వారంటీని అందిస్తామని సంస్థ తెలిపింది. గ్రీన్ లైన్ సమస్య తలెత్తిన డిస్‌ప్లేలకు మాత్రమే ఈ వారంటీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఫోన్ కలర్ వేరియంట్స్ వివరాలు కూడా సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, గ్రీన్, పింక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు వెనుక వైపు గ్లాస్ ఫినిష్‌తో లాంచ్ కానుంది.
Sources tell me OnePlus 13s will be priced in the Rs 55k segment
— Yogesh Brar (@heyitsyogesh) May 29, 2025
Considering all the specs like Snapdragon 8 Elite, OnePlus AI suite, and a premium build..pricing seems solid.
OnePlus has a winner on their hands!
What are your thoughts & price expectations??
శక్తివంతమైన చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ప్లస్ కీ ని కలిగి ఉంటుంది. కెమెరా, ఫ్లాష్ లైట్ సహా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు.
కెమెరా వివరాలు! :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి రానుంది.
కాంపాక్ట్ ఫోన్‌ల కోసం ఎదురుచూసే వారికి ఈ వన్‌ప్లస్ 13s అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ ధర వివరాలు లీక్ అయ్యాయి. అయితే ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలియాల్సి ఉంది. జూన్ 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








