Home
Mobile

ఇవాళ్టి నుంచే OnePlus 13s స్మార్ట్‌ఫోన్ సేల్‌.. ఈ కార్డులపై రూ.5000 డిస్కౌంట్‌..!

OnePlus 13s Sale : వన్‌ప్లస్ ఇండియా గత వారంలో మార్కెట్లోకి వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ కంపాక్ట్‌ ప్రీమియం ఫోన్‌గా వచ్చింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. దీంతోపాటు ప్రత్యేకంగా ప్లస్‌ కీ ను కూడా కలిగి ఉంది. రెండు 50MP + 50MP కెమెరాలను కలిగి ఉంది. ఇవాళ్టి నుంచి ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999 గా ఉంది. ఇవాళ్టి మధ్యాహ్నం (జూన్ 12) 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్‌ ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌, రిలయన్స్ డిజిటల్‌, విజయ్‌ సేల్స్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ సహా వన్‌ప్లస్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Oneplus 13s Smartphone sale to start from today here are the bank deals

వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్‌ను SBI కార్డు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇతర కార్డుల ద్వారా రూ.5000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ బ్లాక్ వెల్‌వెట్‌, పింక్ శాటిన్‌, గ్రీన్‌ సిల్స్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Oxygen OS 15 తో పనిచేస్తుంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

డిస్‌ప్లే వివరాలు :
ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.32 అంగుళాల 1.5K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ఆక్వా టచ్‌ 2.0 టెక్నాలజీ, Glove మోడ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌, HDR10+, HDR Vivid సపోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Plus Key తో అందుబాటులోకి వచ్చింది. ఈ బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేసి.. రింగ్‌, వైబ్రేట్‌, సైలెంట్ మోడ్స్‌ నుంచి పరస్పరం మార్చుకోవచ్చు. దీంతోపాటు AI ప్లస్‌ మైండ్‌ స్పేస్‌ను లాంచ్‌ చేయవచ్చు. ఆర్టికల్స్‌, చాట్స్‌, ఫోటోలు, షెడ్యూల్స్‌ను ఇందులో సేల్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్‌ జూమ్‌, f/2.0 అపేచర్‌, EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌)తో 50MP S5KJN5 టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంది. మరియు 32MP EIS సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్‌ కంపాక్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ 80W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 5850mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ గూగుల్‌ సర్కిల్‌ టూ సెర్చ్, AI ట్రాన్స్‌లేషన్‌, AI సెర్చ్‌, AI కాల్‌ అసిస్టెంట్‌, AI వాయిస్‌ స్క్రైబ్‌ తోపాటు AI Reflection Eraser, AI Unblur, AI Detail Boost, AI Reframe ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 13s Smartphone sale to start from today here are the bank deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X