ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 50MP + 50MP కెమెరాలు, పవర్‌ఫుల్ చిప్‌సెట్ సహా!
భారత్ మార్కెట్ లో వన్‌ప్లస్ నుంచి ఇటీవల వన్‌ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 6.83 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 OS, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 80W ఛార్జింగ్ సపోర్టుతో 5850mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే గత సంవత్సరం లాంచ్ అయిన కంపాక్ట్ మోడల్ వన్‌ప్లస్ 13s ను (OnePlus 13s Smartphone) ప్రస్తుతం భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 15s స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో అందుబాటులో ఉంది. అయితే విడుదల సమయంలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.59999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్ రూ.4 వేల డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.

అంటే ఈ ఫోన్ ను ప్రస్తుతం రూ.50999, రూ.55,999 ధరలకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ గ్రీన్ సిల్క్, బ్లాక్ వెల్‌వెట్, పింక్ శాటిన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ కంపాక్ట్ మోడల్ 6.32 అంగుళాల 1.5k LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠంగా బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. డాల్బీ విజన్, HDR Vivid ను సపోర్టు చేస్తుంది. HDR10+ కంటెంట్ ను సపోర్టు చేస్తుంది.

ఈ డిస్‌ప్లే ఆక్వా టచ్ 2.0, గ్లౌజ్ మోడ్ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులు. గ్లౌజ్ తోనూ ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్లస్ కీ ను కలిగి ఉంది. దీంతో మైండ్ స్పేస్ ను లాంచ్ చేయవచ్చు. ఈ వన్‌ప్లస్ ఫోన్ 5850mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 80W Supervooc ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Oxygen OS 15 తో పనిచేస్తోంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), 2x ఆప్టికల్ జూమ్ తో 50MP టెలిఫోటో లెన్స్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.


Click it and Unblock the Notifications








