Home
Mobile

వన్‌ప్లస్ 13T స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా కస్టమైజ్ బటన్.. దాంతో ఫీచర్లన్నీ ఈజీగా వాడొచ్చు..

OnePlus 13T Customizable Button: వన్‌ప్లస్ మొబైల్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే వన్‌ప్లస్ కంపెనీ త్వరలోనే సరికొత్త వన్‌ప్లస్ 13T ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్‌లో రెండు అదిరిపోయే ఫీచర్లు ఉంటాయని వన్‌ప్లస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అవేంటంటే.. కొత్తగా కస్టమైజ్ చేసుకునే బటన్, ఇంకా ఫ్లాట్ OLED డిస్‌ప్లే. ఈ మార్పులతో వన్‌ప్లస్ ఫోన్ల డిజైన్‌లోనే కొత్త ట్రెండ్ మొదలవుతుందని చెప్పొచ్చు.

అందుకే వన్‌ప్లస్ 13T లాంచ్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ మొదటగా చైనాలో ఏప్రిల్ నెలలోనే విడుదల కానుంది. కానీ దాని ప్రత్యేకతలు, ప్రీమియం ఫీచర్లతో ఇప్పుడే హాట్ టాపిక్‌గా మారింది. మరి అవేవో తెలుసుకుందాం పదండి.

OnePlus 13T

* అలర్ట్ స్లైడర్ పోయింది.. కొత్త కస్టమైజ్ బటన్ వచ్చింది..
వన్‌ప్లస్ ఫోన్లలో ఇప్పటివరకు మనం చూసిన అలర్ట్ స్లైడర్ ఇకపై వన్‌ప్లస్ 13T లో ఉండదు. దాని స్థానంలో ఫోన్ ఎడమవైపు కొత్త ఫిజికల్ బటన్‌ను వన్‌ప్లస్ తీసుకొచ్చింది. ఈ కొత్త షార్ట్‌కట్ బటన్ ద్వారా సైలెంట్, వైబ్రేట్, రింగ్ మోడ్‌లకు మారొచ్చు. అంతేకాదు, ఇది కేవలం మోడ్స్ మార్చడానికి మాత్రమే కాదు.

వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లూయిస్ జీ ప్రకారం ఈ బటన్‌ను మనకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే రకరకాల షార్ట్‌కట్స్ లేదా క్విక్ యాక్షన్స్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫోన్ వాడకం మరింత సులువుగా, కంట్రోల్‌లో ఉంటుందంటున్నారు. ఇంకా ఏదో ఫన్ ఫీచర్ కూడా ఈ బటన్‌తో ముడిపడి ఉంటుందని చెప్పారు.

* కాంపాక్ట్ డిజైన్..
వన్‌ప్లస్ 13T ఫోన్ 6.3-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో రానుంది. చిన్న ఫోన్లు, స్ట్రెయిట్ స్క్రీన్స్ కావాలనే యూజర్ల ఫీడ్‌బ్యాక్ మేరకే ఈ డిస్‌ప్లేను డిజైన్ చేశారు. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అందుకే వాడే కొద్దీ వాడాలనిపిస్తుంది.

* ఫ్లాట్ డిస్‌ప్లేతో స్టైలిష్ లుక్.. శక్తివంతమైన ప్రాసెసర్
ఫోన్ చుట్టూ చాలా సన్నని బెజెల్స్ ఉండటంతో ఫోన్ చాలా మోడర్న్‌గా కనిపిస్తుంది. ఇంకా గ్లాస్ బ్యాక్, ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్ ఉండటంతో ఫోన్ చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీలింగ్ వస్తుంది. వన్‌ప్లస్ 13T లోపల శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంటుంది. ఇది 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

హెవీగా మొబైల్ వాడే యూజర్లకు కూడా ఈ ఫోన్ చాలా బాగా సరిపోతుంది. ఇందులో మరో హైలైట్ ఏంటంటే 6,200mAh భారీ బ్యాటరీ. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కెమెరాల విషయానికొస్తే వన్‌ప్లస్ ఈసారి ట్రిపుల్ కెమెరా సెటప్‌కు బదులుగా డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది.

* కెమెరాలు, త్వరలో లాంచ్ వివరాలు..
ఇందులో 50MP మెయిన్ కెమెరా (OIS), 50MP టెలిఫోటో లెన్స్ (2x ఆప్టికల్ జూమ్‌తో) ఉంటాయి. ఈసారి అల్ట్రా-వైడ్ కెమెరా ఉండకపోవచ్చు. వన్‌ప్లస్ 13T చైనాలో ఏప్రిల్ నెలాఖరులో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫ్లాట్ స్క్రీన్, కొత్తగా డిజైన్ చేసిన బటన్, హై-ఎండ్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో ఈ ఫోన్ కాంపాక్ట్ ఫోన్లు కావాలనుకునే వారిని బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. లాంచ్ డేట్, గ్లోబల్ రిలీజ్ వంటి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 13T Confirmed, New Customizable Button and Flat Display Headline Compact Flagship Launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X