వన్‌ప్లస్ 13T స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఏప్రిల్ 24 వ తేదీ చైనాలో వన్‌ప్లస్ 13T స్మార్ట్‌ఫోన్ (OnePlus 13T Smartphone Launch Date) విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డిజైన్ సహా ఇతర వివరాలు వెల్లడయ్యాయి. సరికొత్త లుక్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ 13T స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ సైడ్స్, రౌండ్ కార్నర్స్‌తో కూడిన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు 6.32 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5K OLED డిస్‌ప్లేతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 Elite చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీతో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ వెల్లడించిన వివరాలు ఆధారంగా 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని సమాచారం.
అయితే ఈ కెమెరా మాడ్యూల్ ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంటుంది. మెటల్ క్యూబ్ డెకో పేరుతో వన్‌ప్లస్ పిలుస్తోంది. ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో లాంచ్ కానుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2X జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ 13T స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో మార్నింగ్ మిస్ట్ గ్రే, స్పెషల్ పింక్, క్లౌడ్ ఇంక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ మ్యాటీ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. ఏప్రిల్ 24 వ తేదీన చైనాలో ఈ ఫోన్ విడుదల కానుంది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కానుందా లేదా అనే వివరాలు వెల్లడి కాలేదు.
* భారత్ మార్కెట్లో త్వరలో వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ ఏకంగా 7100mAh బ్యాటరీతో లాంచ్ కానుందన తెలుస్తోంది. ఇప్పటికే ఐకూ Z10 ఫోన్ 7300mAh భారీ బ్యాటరీతో విడుదల అయింది. ఒప్పో K13 5G ఫోన్ కూడా భారీ బ్యాటరీతో లాంచ్ కానుంది. వివో కూడా T4 5G మోడల్‌ను భారీ బ్యాటరీతోనే లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Smartprix రిపోర్టు ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ 7100mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. మరియు స్నా్ప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్‌సెట్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు.
మే నెలలో విడుదల కానున్నందని అంచనా వేస్తున్న నేపథ్యంలో త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ భారీ బ్యాటరీ ఫోన్‌లు ఆకట్టుకొనే అవకాశం ఉంది. ధర, డిజైన్, స్టోరేజీ వేరియంట్స్, కెమెరా వంటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








