Home
Mobile

16GB ర్యామ్, 50MP + 50MP కెమెరా, 6260mAh బ్యాటరీతో వన్‌ప్లస్‌ 13T స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

వన్‌ప్లస్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్నార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 13T (OnePlus 13T Smartphone) ఇవాళ విడుదల అయింది. ఈ ఫోన్ వెనుక వైపు 50MP + 50MP కెమెరాలను కలిగి ఉంది. మరియు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. దీంతోపాటు భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌ షాక్ట్ కట్‌ కీ తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

వన్‌ప్లస్‌ 13T స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.32 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ మెటల్‌ ఫ్రేమ్‌ ను కలిగి ఉంది.

Oneplus 13T Smartphone launched

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Adreno 830 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్ + 1TB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 4400mm sq గ్లేసియర్‌ వేపర్‌ ఛాంబర్‌ (VC), 37337 sq mm ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6260mAh బ్యాటరీతో పనిచేస్తుంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది. మరియు IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపేచర్‌, OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, f/2.0 అపేచర్‌, ఆటోఫోకస్‌, 2x ఆప్టికల్ జూమ్, 20X డిజిటల్‌ జూమ్ సామర్థ్యంతో 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ బ్లూటూత్‌ 5.4, వైఫై 7, GPS, NFC ఫీచర్‌లతోపాటు ఇ-కంపాస్‌, గైరో స్కోప్‌, యాక్సెలిరోమీటర్‌, గ్రావిటీ సెన్సార్‌, జియోమాగ్నటిక్‌ సెన్సార్‌, IR కంట్రోల్‌, లైట్ సెన్సార్‌, కలర్‌ టెంపరేచర్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ప్రత్యేక బటన్‌ను కూడా కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్‌ 13T స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ CNY 3399 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.39000), 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ CNY 3599 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.41000), 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ CNY 3799 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.43000), 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ CNY 3999 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.43000) గా ఉంది.

దీంతోపాటు 16GB ర్యామ్‌ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4499 (భారత కరెన్సీ ప్రకారం రూ.52000) గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే విడుదల అయింది. భారత్‌ మార్కెట్‌లో ఈ ఫోన్ విడుదల కానుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ చైనాలో మూడు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. పౌడర్‌ (పింక్‌), మార్నింగ్‌ మిస్ట్‌ గ్రే, క్లౌడ్‌ ఇంక్‌ బ్లా్క్ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 13T Smartphone launched with 16GB RAM, 6260mAh, dual 50MP Camera in china
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X