Home
Mobile

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వివరాలు వెల్లడి.. పవర్‌ఫుల్ చిప్‌సెట్‌, భారీ బ్యాటరీ సహా..!

వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ గురించి ఇటీవలే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్ 5 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుంది. చైనాలో ఈ హ్యాండ్‌సెట్ అక్టోబర్‌ 27 వ తేదీన విడుదల కానుంది. దీంతోపాటు వన్‌ప్లస్ ఏస్ 6 ఫోన్‌ కూడా విడుదల కానుంది. ఈ హ్యండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు కూడా ఇటీవల విడుదల అయ్యాయి.

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ ( OnePlus 15 Smartphone ) భారత్ మార్కెట్‌ లో 2026 జనవరిలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. చైనాలో త్వరలో లాంచ్‌ కానున్న వన్‌ప్లస్‌ ఏస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ లో వన్‌ప్లస్‌ 15R పేరుతో అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్ 15 చైనా వేరియంట్‌ గురించి ఇప్పటికే కీలక వివరాలు వెల్లడి కాగా.. తాజాగా కెమెరా వివరాలు లీక్ అయ్యాయి.

Oneplus 15 Smartphone

తాజాగా కీలక వివరాలు :
చైనా మైక్రో బ్లాకింగ్‌ వెబ్‌సైట్‌ Weibo లో వన్‌ప్లస్‌ షేర్‌ చేసిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ డీటైల్‌ మ్యాక్స్‌ ఇంజిన్‌ ను (గ్లోబల్‌ మార్కెట్) కలిగి ఉండే అవకాశం ఉంది. చైనాలో LUMO కన్డెన్స్‌డ్ లైట్‌ ఇమేజింగ్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా ఇమేజ్‌ క్లారిటీ మెరుగవుతుందని, కలర్, లైట్ కంట్రోల్‌ సక్రమంగా ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా వివరాలు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. 120fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తుంది.

శక్తివంతమైన చిప్‌సెట్! :
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 OS ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది. స్టోరేజీ సహా ఇతర వేరియంట్స్‌ వివరాలు తెలియాల్సి ఉంది.

భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 1.5K BOE ఫ్లెక్సిబుల్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120W వైర్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వస్తుంది.

గత వేరియంట్స్‌ తో పోలిస్తే గేమింగ్‌ సహా పనితీరు పరంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా G2 గేమింగ్‌ నెట్‌వర్క్ చిప్‌ తో లాంచ్ కానుంది. వేగవంతమైన టచ్‌ రెస్పాన్స్‌ కోసం టచ్ డిస్‌ప్లే సింక్‌ ఫీచర్‌ ను కలిగి ఉంటుంది. మెరుగైన కూలింగ్‌ వ్యవస్థతో అందుబాటులోకి రానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 15 Smartphone Camera specifications revealed, here are the confirmed details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X