వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ వేరియంట్స్ వివరాలు విడుదల.. ఎప్పుడు విడుదల కానుంది?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ (OnePlus 15 Smartphone) త్వరలో విడుదల కానుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, డిజైన్ వివరాలు క్రమంగా లీక్ అవుతున్నాయి. పాత మోడల్స్ తో పోలిస్తే ఆకట్టుకొనే డిజైన్, మెరుగైన కెమెరా పనితీరును అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ తొలుత చైనాలో విడుదల కానుంది. అనంతరం గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ వచ్చే సంవత్సరం (2026) జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.74999 ప్రారంభ ధరకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. తాజాగా వచ్చిన లీక్స్ ఆధారంగా స్వేర్ డిజైన్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 2 + 1 రూపంలో కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ గురించి ప్రస్తుతం ఉన్న అంచనా వివరాలు.

వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ అంచనా వివరాలు :
ప్రస్తుత లీక్స్ ఆధారంగా వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల LTPO OLED ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 165Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ మిస్ట్ పర్పుల్, అబ్‌సొల్యూట్ బ్లాక్, డూన్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite 2 చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఫ్లాష్‌షిప్ పనితీరును అందించే అవకాశం ఉంది. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా సాధారణ, హెవీ యూజర్లను కూడా ఆకట్టుకొనే అవకాశం ఉంది.
మూడు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా గత మోడల్స్ తో పోలిస్తే మెరుగైన పనితీరును పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంటాయి. ఇందులో వైడ్ యాంగిల్, అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్ తో కూడిన టెలిఫోటో కెమెరాలతో అందుబాటులోకి వస్తుంది. తక్కువ లైటింగ్ లోనూ మెరుగైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చని తెలుస్తోంది.
చైనాలోనే తొలుత విడుదల :
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ చైనాలో మొదట విడుదల కానుంది. ప్రస్తుతం వస్తున్న లీక్స్ ఆధారంగా అక్టోబర్ నెలలో చైనాలో లాంచ్ కానుంది. భారత్ మార్కెట్లో ఈ ఫోన్ జనవరి 2026 నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ.75 వేల ధరలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
అయితే వన్‌ప్లస్ 15 విడుదల సహా ఇతర స్పెసిఫికేషన్ లు, ఫీచర్ల పై వనప్లస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ రూ.69999 ధరకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Photo Credit: The West Wind Blows (Weibo)


Click it and Unblock the Notifications








