Home
Mobile

OnePlus 15 Smartphone : వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్‌ కానుందంటే..?

OnePlus 15 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి త్వరలో వన్‌ప్లస్ 15 విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఈ ఫోన్ తొలుత చైనాలో విడుదల కానుంది. అనంతరం భారత్‌ సహా గ్లోబల్ మార్కెట్‌ లో అందుబాటులోకి రానుంది. అయితే తాజాగా భారత్‌ లో ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన వివరాలు లీక్‌ అయ్యాయి.

వన్‌ప్లస్ ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుంది? :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ చైనాలో నవంబర్ 13 వ తేదీన విడుదల కానుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భారత్‌ సహా గ్లోబల్ మార్కెట్లో 2026 జనవరి నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

OnePlus 15 Smartphone

వన్‌ప్లస్ కంపాక్ట్‌ మోడల్ తరహాలో! :
ఇటీవలే ఈ ఫోన్‌ డిజైన్‌ వివరాలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాంపాక్ట్‌ మోడల్‌ వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్ తరహా కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. దీని ఆధారంగా ఈ ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలు, ఫ్లాష్‌ లైట్‌ ను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌ తో లాంచ్ కానుంది.

శక్తివంతమైన చిప్‌సెట్ :
ఇప్పటికే ఈ ఫోన్‌ చిప్‌సెట్‌ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఇటీవలే విడుదల అయిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ ప్రస్తుతానికి శక్తివంతమైనదిగా ఉంది. ఈ ప్రాసెసర్‌ LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ 16GB ర్యామ్, 1TB స్టోరేజీతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

165Hz రీఫ్రెష్‌ రేట్‌తో డిస్‌ప్లే :
వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ BOE X3 1.5K LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 165Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. మరియు గేమింగ్‌ కోసం ప్రత్యేక ఫీచర్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుందని సమాచారం.

50MP టెలిఫోటో లెన్స్‌ :
కెమెరా విభాగం పరంగా ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కెమెరాలతో అత్యంత మెరుగైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్‌ చేయవచ్చని తెలుస్తోంది. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

7300mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌ భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. 120W వైర్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్‌ లో ఈ స్మార్ట్‌ఫోన్ సుమారుగా రూ.80,000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 15 Smartphone expected to launch in india in january 2026 here are the specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X