OnePlus 15 : వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ కానుంది..?
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ చైనాలో అక్టోబర్ 27 వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్‌తోపాటు వన్‌ప్లస్ ఏస్ 6 మోడల్ కూడా విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 15 స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్ లో ఎప్పుడు విడుదల కానుందనే విషయంపై అనేక లీక్స్ వస్తున్నాయి.
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ (OnePlus 15 Smartphone) గురించి టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ కీలక వివరాలు వెల్లడించారు. స్వీడెన్ లో ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ను షేర్ చేశారు. దీని ఆధారంగా ఆ మార్కెట్ లో నవంబర్ 12 వ తేదీన లాంచ్ కానుందని తెలిపారు.

ఆండ్రాయిడ్ 16 OS :
వన్‌ప్లస్ 15 ఫోన్ భారత్ లో వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ తోపాటు అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. మరియు భారత్‌లో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16, స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ను ఇటీవలే క్వాల్‌కాం లాంచ్ అయింది.
7300mAh భారీ బ్యాటరీ :
అయితే ఈ హ్యాండ్‌సెట్ 120W సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో లెన్స్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
మరింత మెరుగైన విజువల్ అనుభూతి కోసం! :
డిస్‌ప్లే పరంగా మెరుగైన విజువల్ అనుభూతి కలిగి విధంగా 165Hz రీఫ్రెష్ రేట్ తో 1.5K BOE ఫ్లెక్సిబుల్ ఒరియంటల్ OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 27 వ తేదీన ఈ ఫోన్ చైనా మార్కెట్ లో లాంచ్ కానుంది. దీని ద్వారా ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఎప్పుడు లాంచ్ అయ్యే అవకాశం ఉంది :
ప్రస్తుత అంచనా వివరాల ఆధారంగా ఈ ఫోన్ భారత్ మార్కెట్ లో రూ.70 వేల నుంచి రూ.75 వేల ధర రేంజ్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల వచ్చిన కొన్ని వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 15 హ్యాండ్‌సెట్ నవంబర్ 13 వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే వన్‌ప్లస్ ఇండియా అధికారికంగా లాంచ్ వివరాలను వెల్లడించలేదు.
మరో ఫోన్ కూడా విడుదల కానుంది :
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌తోపాటు వన్‌ప్లస్ 15R కూడా భారత్ మార్కెట్ లో లాంచ్ కానుంది. చైనాలో విడుదల కానున్న వన్‌ప్లస్ ఏస్ 6 హ్యాండ్‌సెట్ భారత్ సహా ఇతర మార్కెట్లలో వన్‌ప్లస్ 15R గా లాంచ్ కానుంది. చైనా వేరియంట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ చిప్‌సెట్ తో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








