Home
Mobile

శక్తివంతమైన ప్రాసెసర్‌, భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ సహా కీలక వివరాలు..!

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 15 Smartphone) గురించి ఇటీవల అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా విడుదల తేదీ సహా ఇతర వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్‌ అక్టోబర్‌ 27 వ తేదీన చైనాలో విడుదల కానుంది. వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌తోపాటు వన్‌ప్లస్‌ Ace 6 స్మార్ట్‌ఫోన్‌ కూడా కూడా చైనాలో లాంచ్ చేయనుంది.

భారత్‌లో ఎప్పుడు విడుదల కానుంది :
చైనాలో అక్టోబర్‌ 27 వ తేదీ 07:00 PM గంటలకు (భారత కాలమానం ప్రకారం 04:30 PM IST గంటలు) లాంచ్ కానుంది. అయితే వన్‌ప్లస్ ఏస్‌ 6 మోడల్‌ భారత్‌ సహా ఇతర గ్లోబల్‌ మార్కెట్స్‌లో వన్‌ప్లస్ 15R పేరుతో విడుదల కానుంది. వన్‌ప్లస్‌ 15, వన్‌ప్లస్‌ 15R భారత్‌లో 2026 జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Oneplus 15 smartphone launch date revealed  here are the confirmed specifications

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో అందుబాటులోకి రానుంది. మరియు డిజైన్‌ పరంగానూ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు సెల్ఫీ కెమెరా కోసం పంచ్‌ హోల్‌ కటౌట్‌ను కలిగి ఉంటుంది. చిన్న కర్వడ్‌ ఎడ్జ్‌ డిజైన్‌, స్వేర్‌ ఆకారంలో వెనుక కెమెరా మాడ్యూల్ ఉంటుంది.

వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఇప్పటికే విడుదల అయిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల అందుబాటులోకి వచ్చిన స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్‌ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 100W వైర్ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌ శాండ్‌ డూన్‌, అబ్‌సెల్యూట్‌ బ్లాక్, మిస్ట్ పర్పుల్ వంటి మూడు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT-700, 50MP శాంసంగ్‌ JN5 పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

Oneplus 15 smartphone launch date revealed  here are the confirmed specifications

వన్‌ప్లస్‌ ఏస్‌ 6 స్మార్ట్‌ఫోన్ :
వన్‌ప్లస్‌ ఏస్ 6 ఫోన్‌ భారత్‌లో వన్‌ప్లస్ 15R గా లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ సుమారుగా వన్‌ప్లస్ 15 తరహాలోనే ఉండనుంది. అయితే కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను మాత్రమే ఉండనున్నాయి. ప్రైమరీ, అల్ట్రావైడ్‌ కెమెరాలతో లాంచ్‌ కానుంది.

ఈ ఫోన్‌ డార్క్‌ బ్లూ లేదా బ్లాక్‌ తోపాటు వైట్‌, స్టైకింగ్ సిల్వర్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.5K BOE OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్‌ ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ప్రీమియం మెటల్‌ ఫ్రేమ్‌తో లాంచ్‌ కానుంది.

వన్‌ప్లస్ ఏస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7800mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. మరియు ఈ ఫోన్ పటిష్ఠమైన గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 15 smartphone launch date revealed, here are the confirmed specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X