Home
Mobile

7300mAh భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌, 50MP + 50MP+ 50MP కెమెరాలతో ఫోన్‌..!

OnePlus 15 Smartphone : వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 16 OS ను కలిగి ఉంది. భారత్‌లో ఈ చిప్‌తో లాంచ్‌ అయిన తొలి ఫోన్‌గా నిలిచింది. ఈ కెమెరాలు 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ సేల్‌ కూడా ప్రారంభం అయింది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల QHD+ (1272 x 2772 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 165Hz రీఫ్రెష్‌ రేట్, 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్, 450 ppi పిక్సల్స్‌ డెన్సిటీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ సన్‌ డిస్‌ప్లే టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. ఫలితంగా సూర్యకాంతి లోనూ ఈ ఫోన్‌ను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.

OnePlus 15 Smartphone launched

లేటెస్ట్‌ క్వాల్‌కాం చిప్‌సెట్ :
వన్‌ప్లస్ 15 ఫోన్‌ క్వాల్‌కాం 3nm ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x అల్ట్రా ప్లస్‌ ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు Adreno 840 GPU, G2 Wi-Fi చిప్‌ టచ్‌ రెస్పాన్స్‌ చిప్‌ ను కూడా కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 360 కైరో వెలాసిటీ కూలింగ్‌ సిస్టమ్‌లో భాగంలో 5731 sq mm 3D వేపర్‌ ఛాంబర్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ జెమిని ఏఐ, ఏఐ రికార్డర్, ఏఐ పొర్ట్రెయిట్‌ గ్లో, ఏఐ ప్లేల్యాబ్‌, ఏఐ స్కాన్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది.

OnePlus 15 Smartphone launched

మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. Detailmax Image Engine తో కూడిన కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా దీంతోపాటు 3.5x ఆప్టికల్ జూమ్‌. 7x ఆప్టికల్‌ క్వాలిటీ జూమ్‌ సామర్థ్యంతో 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో కెమెరా ఉంది. 116 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 50MP అల్ట్రా వైడ్‌ కెమెరాను అమర్చారు.

ఈ కెమెరాలు 30fps వద్ద 8K వీడియోలను రికార్డింగ్ చేయవచ్చు. 120fps తో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సోనీ IMX709 కెమెరాను కలిగి ఉంది. 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

39 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్‌ :
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ 120W SuperVOOC, 50W AirVOOC వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం 39 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని వన్‌ప్లస్ చెబుతోంది.

కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 6.0, వైఫై 7, GPS, NavlC వంటి పీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ యాంబియంట్ లైట్‌, కలర్‌ టెంపరేచర్‌, ఇ-కంపాస్‌, యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్‌, హాల్‌ సెన్సర్‌, లేజర్‌ ఫోకస్, బారోమీటర్‌, IR బ్లాస్టర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌ ఉన్నాయి.

ఈ హ్యాండ్‌సెట్‌ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ ఉంది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ బరువు 211 గ్రాములుగా ఉంది.

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72999 గా ఉంది. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79999 గా ఉంది. HDFC బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ ఫోన్ సేల్‌ ఇవాళ 8 PM గంటల నుంచి ప్రారంభం అయింది. వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఇన్ఫినిట్‌ బ్లాక్‌, శాండ్ స్ట్రోమ్‌, అల్ట్రా వైలెట్ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 15 Smartphone launched with snapdragon 8 Elite Gen 5 Chip, 7300mAh Battery in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X