వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ విడుదల.. పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ సహా సూపర్ ఫీచర్లు..!
OnePlus 15 Smartphone : వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో విడుదల అయింది. ఇటీవల లాంచ్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 OS పైన పనిచేస్తుంది.
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల BOE 1.5K (1271 x 2772 పిక్సల్స్) ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 165Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 330Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే 100 శాతం DCI-P3, 1.07 బిలియన్ కలర్స్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం ఆక్టో కోర్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. Adreno 840 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఈ కెమెరాలు 30fps వద్ద 8K రిజల్యూషన్‌ను సపోర్టు చేస్తుంది. 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
120W ఛార్జింగ్ సపోర్టు, భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ 5G, బ్లూటూత్, వైఫై 7, NFC, GPS వంటి సహా మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు IR బ్లాస్టర్ కూడా ఉంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు. వీటితోపాటు ఫ్రాక్సిమిటీ, గైరో స్కోప్, హాల్ సెన్సర్, లేజర్ ఫోకస్ సెన్సర్, స్పెక్ట్రమ్, ఎలక్ట్రానిక్ కంపాస్, కలర్ టెంపరేచర్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్ ఉన్నాయి.
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలోనే విడుదల అయింది. భారత్‌లో విడుదల తేదీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. చైనా మార్కెట్‌లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3999 (భారత కరెన్సీ ప్రకారం రూ.50,000) గా ఉంటుంది. ఈ ఫోన్ 16GB/256GB, 12GB/512GB, 16GB/512GB, 16GB/1TB వేరియంట్స్‌లో లభిస్తుంది.
చైనా మార్కెట్‌లో వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 28 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఆ మార్కెట్లో మూడు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. భారత్లో ఈ ఫోన్ అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. అయితే విడుదల తేదీ సహా మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








