Home
Mobile

ఇవాళే వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర అంచనా వివరాలు..!

OnePlus 15 Smartphone india launch : వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో ఇవాళ సాయంత్రం 7 గంటలకు విడుదల కానుంది. మరియు ఇవాళే 8PM గంటలకు సేల్‌ కూడా ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ద్వారా లాంచ్‌ ఈవెంట్‌ లైవ్ చూడవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. అంచనా ధర వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్‌ డిజిటల్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా ఈ వివరాలు లీక్‌ అయ్యాయి.

అంచనా ధర వివరాలు :
ఈ వెబ్‌సైట్ ఆధారంగా వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లతోపాటు ధర వివరాలు లీక్‌ అయ్యాయి. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72999 గా ఉంటుందని తెలుస్తోంది. అల్ట్రా వైలెట్‌ కలర్‌ వేరియంట్‌ లో లిస్టింగ్‌ అయింది.

OnePlus 15 Smartphone

ఈ హ్యాండ్‌సెట్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌ లోనూ విడుదల కానుంది. శాండ్‌ స్ట్రోమ్‌ కలర్ వేరియంట్‌ లోనూ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే ఈ ధర వివరాలపై వన్‌ప్లస్‌ ఎటువంటి స్పందన తెలియజేయలేదు.

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.78 అంగుళాల BOE X3 LTPO ఫ్లాట్‌ 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్ 5 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌ 16GB LPDDR5x ర్యామ్‌, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది.

ట్రిపుల్ కెమెరా యూనిట్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌, 50MP పెరిస్కోప్‌ లెన్స్‌ ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులోకి రానుంది. ఈ కెమెరా 4k వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తుంది.

7300mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 120W వైర్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్‌ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 8 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మరో ఫోన్‌ ఎప్పుడు లాంచ్ కానుందంటే?
ఈ ఫోన్‌ గత నెల లోనే చైనాలో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు వన్‌ప్లస్ ఏస్‌ 6 మోడల్ కూడా లాంచ్‌ అయింది. ఈ ఏస్‌ మోడల్‌ భారత్‌ సహా ఇతర మార్కెట్స్‌ లో వన్‌ప్లస్‌ 15R గా లాంచ్ కానుందని తెలుస్తోంది. 2026 జనవరి నెలలో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చైనా వేరియంట్‌ ఆధారంగా వన్‌ప్లస్‌ 15R హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన వివరాలను అంచనా వేయవచ్చు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 15 Smartphone launching in india today here are the specifications, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X