Home
Mobile

రేపే వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. శక్తివంతమైన చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 16, 7300mAh బ్యాటరీ!

OnePlus 15 Smartphone launch : వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌ లో రేపు (నవంబర్ 13 వ తేదీ) 7:00PM గంటలకు విడుదల కానుంది. లాంచ్‌ ఈవెంట్‌ ను వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌ లో స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ తో లాంచ్‌ కానుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ అనేక వివరాలు వెల్లడయ్యాయి.

సేల్‌ కూడా :
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ రేపు విడుదల అయిన అనంతరం 8:00PM (IST) గంటలకు వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. కొన్ని రిపోర్టుల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ ఫోన్ రూ.75 వేల కంటే తక్కువ ధరలోనే విడుదల కానుందని భావిస్తున్నారు.

Oneplus 15 smartphone launching on tomorrow in india here are the specifications and features

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే వివరాలు :
వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల BOE X3 8T LTPO 1.5K ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ డిస్‌ప్లే 165Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ 120W వైర్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

శక్తివంతమైన చిప్‌సెట్‌! :
ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 SoC చిప్‌సెట్‌, Adreno 840 GPU ను కూడా కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పైనిచేస్తుంది.

50MP + 50MP + 50MP కెమెరాలు! :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS ( ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉంటుంది.

8K వీడియో రికార్డింగ్‌ :
ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ సెల్ఫీ కెమెరాతో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. అదే వెనుక వైపు ఉన్న కెమెరాల ద్వారా 30fps వద్ద 8K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ IP66/IP68/69/69K రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ బ్లూటూత్‌ 5.4, వైఫై 7, NFC వంటి ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ను కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో జనవరి 2026 లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Oneplus 15 smartphone launching on tomorrow in india here are the specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X