Home
Mobile

వన్‌ప్లస్‌ 15 ఛార్జింగ్ సపోర్టు సహా కీలక స్పెసిఫికేషన్ల వివరాలు లీక్‌.. పూర్తి వివరాలు..!

వన్‌ప్లస్‌ నుంచి ఇటీవల వన్‌ప్లస్‌ నార్డ్ 5, నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. మిడ్‌రేంజ్‌లో లాంచ్ అయ్యాయి. అయితే త్వరలో వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ (OnePlus 15 Smartphone) విడుదల కానుందని తెలుస్తోంది. గత సంవత్సరం విడుదల అయిన వన్‌ప్లస్ 13 మోడల్‌కు తర్వాత తరం వెర్షన్‌ గా ఈ కొత్త ఫోన్‌ అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతో ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.

సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో :
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ తాజాగా IECEE సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్లో CPH2747 మోడల్‌ నంబర్‌తో లిస్టింగ్ అయింది. ఈ మోడల్‌ నంబర్‌ వన్‌ప్లస్ 15 కు చెందినదని Xpertpick రిపోర్టు చెబుతోంది. ఈ లిస్టింగ్‌ ఆధారంగా ఈ ఫోన్ ఛార్జింగ్ సపోర్టు సహా అనేక వివరాలు లీక్‌ అయ్యాయి.

OnePlus 15 Smartphone may features 120W Fast Charging Support  here are the leaked details

120W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌! :
ఈ లిస్టింగ్ ఆధారంగా 121W అడాప్టర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని ఆధారంగా ఈ ఫోన్ 120W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో వచ్చిన లీక్స్‌ ఆధారంగా ఈ మోడల్‌ 7000mAh లేదా అంతకంటే భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇటీవలే గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌లో :
ఇటీవలే వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌ లో PLK110 మోడల్ నంబర్‌తో కనిపించింది. దీని ఆధారంగా ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Elite 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు కెమెరా విభాగం పరంగానూ అప్‌గ్రేడ్‌ ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌.. వన్‌ప్లస్‌ 13 తో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్స్‌ను పొందుతుందని తెలుస్తోంది. డిస్‌ప్లే, బ్యాటరీ, చిప్‌సెట్‌, కెమెరా విభాగం సహా ఛార్జింగ్ పరంగానూ ఫ్లాగ్‌షిప్‌ స్పెసిఫికేషన్‌లతో వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.82 అంగుళాల క్వాడ్ HD+ LTPO 4.1 ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ సపోర్టును కలిగి ఉంది. మరియు ఈ ఫోన్‌ డిస్‌ప్లే సిరామిక్ గార్డ్‌ ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌, Adreno 830 GPU తో పనిచేస్తుంది. 24GB LPPDR5x ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 OxygenOS 15.0 తో పనిచేస్తుంది. 100W వైర్‌ SuperVOOC ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరా, 50MP కెమెరాను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
OnePlus 15 Smartphone may features 120W Fast Charging Support, here are the leaked details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X