Home
Mobile

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల లీక్‌.. ఈ వారంలోనే ఇండియాలో విడుదల..!

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ (OnePlus 15 Smartphone) ఇటీవలే చైనాలో విడుదల అయింది. ఈ వారంలో భారత్‌ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌ ఇటీవలే విడుదల అయిన స్నా్‌ప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌తో లాంచ్ కానుంది. దీంతోపాటు భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే తాజాగా ఈ ఫోన్ ధర వివరాలు లీక్‌ అయ్యాయి.

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో నవంబర్ 13 వ తేదీన 7.00 PM గంటలకు విడుదల కానుంది. అదే రోజు 8.00 PM గంటలకు సేల్‌ కూడా ప్రారంభం కానుంది. వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్, ఇతర రిటైల్‌ ప్లాట్‌ఫాంల ద్వారా ఫోన్‌ను అందుబాటులోకి రానుంది.

OnePlus 15 Smartphone price leaked in india ahead of launch on November 13 2025

ధర వివరాలు లీక్! :
తాజాగా ఈ ఫోన్ ధర వివరాలు లీక్‌ అయ్యాయి. ఓ X యూజర్ వన్‌ప్లస్ 15 ఫోన్ వివరాలను లీక్ చేశారు. దీని ఆధారంగా ఈ ఫోన్‌ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.76999 గా ఉంటుందని అంచనా వేశారు.

అయితే రూ.2699 విలువైన వన్‌ప్లస్‌ నార్డ్‌ ఇయర్‌బడ్స్‌ తో కలిపి ఈ ధరకు అందుబాటులోకి వస్తాయని X యూజర్‌ తెలిపారు. అయితే ఈ ధర వివరాలపై వన్‌ప్లస్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. విడుదల సమయంలోనే ధరలపై స్పష్టత రానుంది. ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ 13 ఫోన్‌ ప్రారంభ ధర రూ.69,999 గా ఉండేది.

డిస్‌ప్లే వివరాలు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల BOE X3 8T LTPO 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

లేటెస్ట్ చిప్‌సెట్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్ జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌ 16GB LPDDR5x ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపటు Adreno 840 GPU పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు ఉంటాయి. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 50MP పెరిస్కోప్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుంది.

ఈ ఫోన్‌ సెల్ఫీ కెమెరా 30 fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. అదే వెనుక వైపు ఉన్న కెమెరాలు 30 fps వద్ద 8K రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు. బ్యాటరీ విభాగం పరంగా 120W వైర్, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్‌ 15 హ్యాండ్‌సెట్‌ సుమారుగా 8.31mm థిక్‌నెస్‌, 215 గ్రాముల బరువును కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు IP66, IP68, IP69, IP69K రేటంగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.4, వైఫై 7, NFC, USB-C ఛార్జింగ్‌ ఉంటాయని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 15 Smartphone price leaked in india ahead of launch on November 13 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X