ఇవాళే వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..!
వన్‌ప్లస్ నుంచి గత నెలలో వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఇవాళ భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్ కూడా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ డివైజ్‌ల గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ కూడా అనేక వివరాలను అధికారికంగా వెల్లడించింది.
ఎప్పుడు విడుదల కానున్నాయి :
వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ (OnePlus 15R Smartphone), వన్‌ప్లస్ ప్యా్డ్ గో 2 ట్యా్బ్లెట్ (OnePlus Pad Go 2 Tablet) భారత్ మార్కెట్‌లో ఇవాళ 7:00PM గంటలకు ప్రారంభం కానుంది. లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ చూడవచ్చు. విడుదల అనంతరం వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ OnePlus.in, అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

ధర వివరాలు లీక్ :
ఇటీవల వచ్చిన కొన్ని లీక్స్ ఆధారంగా వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.46999 లేదా రూ.47999 గా ఉండే అవకాశం ఉంది. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర సుమారుగా రూ.51999 గా ఉంటుందని అంచనా వేశారు.
దీంతోపాటు బ్యాంకు కార్డులపై రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు డిస్కౌంట్‌ను పొందే అవకాశం ఉందని తెలిపింది. భారత్ మార్కెట్‌లో ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ మింట్ గ్రీన్, ఛార్‌కోల్ బ్లాక్, ఎలక్ట్రిక్ వైలెట్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ చిప్‌తో తొలి ఫోన్ ఇదే! :
వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ 3nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌తో లాంచ్ కానుంది. ఈ చిప్‌తో లాంచ్ అయ్యే తొలి ఫోన్ ఇదేనని వన్‌ప్లస్ చెబుతోంది. దీంతోపాటు G2 Wi-Fi చిప్ కూడా ఉంటుందని తెలిపింది. మరియు టచ్ రెన్పాన్స్ చిప్ కూడా ఉంటుందని తెలిపింది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది. మరియు 165Hz రీఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. IP66, IP68, IP69, IP69K రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా మెరుగైన పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 7400mAh బ్యాటరీతో పనిచేస్తుందని వన్‌ప్లస్ తెలిపింది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది. 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానుంది. 120fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 స్పెసిఫికేషన్‌లు :
ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది. 12.1 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. ఈ ట్యాబ్లెట్ 10,050mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది.
వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్ ధర సుమారుగా రూ.25 వేలుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత వేరియంట్‌తో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. అందువల్లనే గత మోడల్ రూ.19999 ధరకు లాంచ్ కాగా.. కొత్త వెర్షన్ ధర ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








