Home
Mobile

ఈ ప్రాసెసర్‌ తో విడుదల కానున్న తొలి ఫోన్‌ ఇదే.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ కూడా ప్రారంభం అయింది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్ 5 చిప్‌, 7300mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 OS ను కలిగి ఉంది. త్వరలో వన్‌ప్లస్‌ నుంచి మరో ఫోన్‌ లాంచ్‌ కానుంది. వన్‌ప్లస్‌ 15R పేరుతో విడుదల కానుంది. ఇటీవలే ఈ ఫోన్ విడుదల తేదీ వెల్లడయింది. తాజాగా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.

వన్‌ప్లస్ 15R భారత్ మార్కెట్‌ లో (OnePlus 15R Smartphone Chipset) డిసెంబర్‌ 17 వ తేదీన విడుదల కానుంది. అదే రోజు వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో 2 ట్యాబ్లెట్‌ కూడా విడుదల కానుంది. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మింట్‌ బ్రీజ్‌, చార్‌కోల్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌ లో లాంచ్ కానుందని వన్‌ప్లస్‌ తెలిపింది.

Oneplus 15R smartphone chipset

ఈ చిప్‌సెట్‌తో తొలిఫోన్‌ ఇదే :
ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 మొబైల్‌ ప్లాట్‌ఫాం ప్రాసెసర్‌ పైన పనిచేస్తుందని వన్‌ప్లస్‌ తెలిపింది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్న తొలి ఫోన్ ఇదేనని వన్‌ప్లస్‌ తెలిపింది. మరియు ఈ గత వేరియంట్‌ తో పోలిస్తే ఈ ఫోన్‌ మరింత మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలిపింది. ఈ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ ఆకట్టుకొనే కెమెరా డెకోను కలిగి ఉంటుంది. దీంతోపాటు IP66, IP68, IP69, IP69K రేటింగ్‌ తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది. ఇటీవల వచ్చిన లీక్స్‌ ఆధారంగా ఈ ఫోన్ 6.7 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Oneplus 15R smartphone chipset

కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్ ను ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 8000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ లీక్స్‌ పైన వన్‌ప్లస్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల QHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 165HZ రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 120W SuperVOOC, 50W AirVOOC వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది.

Oneplus 15R smartphone chipset

3nm ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX906 ప్రైమరీ, 3.5x ఆప్టికల్ జూమ్‌. 7x ఆప్టికల్‌ క్వాలిటీ జూమ్‌ తో 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో లెన్స్‌, 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలున్నాయి. 32MP సోనీ IMX709 కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 15R smartphone confirmed to feature snapdragon 8 gen 5 Chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X