Home
Mobile

వన్‌ప్లస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. ఏకంగా 7800mAh భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 16 OS సహా..!

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ఇటీవల విడుదల అయింది. సేల్ కూడా ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్ 5 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 OS పైన పనిచేస్తుంది. అయితే త్వరలో వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల కానుంది. ఈ వివరాలను వన్‌ప్లస్ అధికారికంగా వెల్లడించింది.

వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 15R Smartphone Launch date) విడుదలతోపాటు వన్‌ప్లస్ ప్యాడ్‌ గో 2 కూడా ఆవిష్కరించనున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల అనంతరం అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. అయితే సేల్‌ తేదీని వన్‌ప్లస్‌ వెల్లడించాల్సి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

OnePlus 15R Smartphone

ఎప్పుడు విడుదల కానుంది? :
వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ గత నెలలో చైనాలో విడుదల అయిన వన్‌ప్లస్‌ ఏస్ 6 మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌లా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్‌ ఇండియా కూడా ఈ హ్యాండ్‌సెట్‌ కొన్ని వివరాలను వెల్లడించింది.

వాటర్‌ రెసిస్టెంట్‌ :
వన్‌ప్లస్‌ 15R ఫోన్‌ మింట్‌ బ్రీజ్‌, చార్‌కోల్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. కెమెరా మాడ్యూల్‌ సహా ఫోన్‌ డిజైన్‌ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్ లెన్స్‌ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాతో అందుబాటులోకి వస్తుందని వన్‌ప్లస్‌ తెలిపింది.

ఈ హ్యాండ్‌సెట్‌ భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుంది. 120W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. చిప్‌సెట్ సహా డిస్‌ప్లే ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో 2 ట్యాబ్లెట్ :
భారత్‌ మార్కెట్లో వన్‌ప్లస్ 15R విడుదల కానున్న డిసెంబర్‌ 17 వ తేదీనే వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో 2 ట్యాబ్లెట్ ను కూడా ఆవిష్కరించనున్నారు. సన్నని డిజైన్‌తో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. డిజైన్‌ పరంగానూ ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్‌ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్‌ భారత్‌ మార్కెట్‌లో షాడో బ్లాక్‌, లావెండర్‌ డ్రిఫ్ట్‌ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ ట్యాబ్లెట్‌ డిస్‌ప్లే, చిప్‌సెట్‌, ప్రాసెసర్‌, కెమెరాలు సహా ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ :
వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్ 165HZ రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల QHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం 3nm ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తోంది. వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌తోపాటు అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ Detailmax Image Engine భాగస్వామ్యంతో 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా ఉంది. 3.5x ఆప్టికల్ జూమ్‌. 7x ఆప్టికల్‌ క్వాలిటీ జూమ్‌తో 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్‌ కెమెరాలు ఉన్నాయి. 32MP సోనీ IMX709 కెమెరాను కలిగి ఉంది. 120W SuperVOOC, 50W AirVOOC వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 15R Smartphone launch date confirmed in india here are the confirmed specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X