7400mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్, 1.5k అమోలెడ్ డిస్‌ప్లేతో వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్
OnePlus 15R Smartphone : వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ ఇవాళ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. వన్‌ప్లస్ సంస్థ ఇవాళ నిర్వహించిన లాంచ్ ఈవెంట్‌లో ఈ ఫోన్‌తోపాటు వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, 7400mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. G2 వైఫై చిప్ కూడా ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 165Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+ సపోర్టును కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు టచ్ రెస్పాన్స్ చిప్, G2 వైఫై చిప్ ను కూడా అమర్చి ఉంది. Adreno 8 సిరీస్ GPU ను కూడా కలిగి ఉంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOs 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని వన్‌ప్లస్ తెలిపింది. 43,940 mm sq కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 120fps వద్ద 4K వీడియోను రికార్డు చేయవచ్చు. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. సెల్ఫీ కెమెరా 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

7400mAh భారీ బ్యాటరీ :
ఈ వన్‌ప్లస్ ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7400mAh బ్యాటరీని కలిగి ఉంది. రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. దీంతోపాటు బైపాస్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా చర్యలు తీసుకుంటుంది.
ఈ ఫోన్ IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 6.0, వైఫై 7, NFC, USB-C, GPS, NavIC వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సర్, గైరోస్కోప్, యాక్సెలిరోమీటర్, కలర్ టెంపరేచర్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఇ-కంపాస్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ను కలిగి ఉంది.
వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.47999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.52999 గా ఉంది. ముందస్తు బుకింగ్‌లకు ఇవాళ్టి నుంచే అవకాశం కల్పించింది.
ఈ హ్యాండ్‌సెట్ సేల్ డిసెంబర్ 22 మధ్యా్హ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఇతర ముఖ్యమైన ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఛార్‌కోల్ బ్లాక్, మింట్ బ్రీజ్, ఎలక్ట్రిక్ వైలెట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








