Home
Mobile

వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు లీక్‌.. స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌, 7400mAh భారీ బ్యాటరీ సహా..!

OnePlus 15R Smartphone : వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో నవంబర్‌ రెండో వారంలో లాంచ్‌ అయింది. ఫోన్‌ క్వాల్‌కాం లేటెస్ట్‌ చిప్‌సెట్‌తోపాటు భారీ బ్యాటరీ సహా అనేక ప్రత్యేక ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. అయితే వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుంది. చైనాలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వన్‌ప్లస్‌ ఏస్‌ 6T కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా అందుబాటులోకి వ‌స్తుందని తెలుస్తోంది.

ఈ ప్రాసెసర్‌తో పనిచేసే తొలి ఫోన్ ఇదే! :
వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 చిప్‌తో విడుదల కానుంది. ఈ చిప్‌తో లాంచ్‌ కానున్న తొలిఫోన్‌ ఇదేనని వన్‌ప్లస్‌ చెబుతోంది. లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ OS తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

OnePlus 15R Smartphone price leaked in india

ఎంత ధరలో అందుబాటులోకి రానుందంటే? :
వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను టిప్‌స్టర్‌ పరాస్‌ గుగ్‌లానీ అంచనా వేశారు. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.45999 లేదా రూ.46999 గా ఉంటుందని తెలిపారు. అదే విధంగా 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.51999 గా ఉంటుందని అంచనా వేశారు.

డిస్కౌంట్‌, కలర్ వేరియంట్స్‌ వివరాలు :
తొలిసేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 నుంచి రూ.4000 డిస్కౌంట్‌ను అందించవచ్చని టిప్‌స్టర్‌ తెలిపారు. ఈ హ్యాండ్‌సెట్ మింటీ గ్రీన్‌, ఛార్‌కోల్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఫుల్‌ HD+ డిస్‌ప్లే :
వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.83 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గేమింగ్‌ సహా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతోపాటు IP66, IP68, IP69, IP69K రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వన్‌ప్లస్‌ 15 కంటే భారీ బ్యాటీరీతో :
ఈ వన్‌ప్లస్‌ ఫోన్‌ 7400mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అయితే 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది. గత నెలలో లాంచ్‌ అయిన వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.

అయితే కెమెరా విభాగం పరంగా ప్రస్తుతం ఉన్న లీక్స్‌, రిపోర్టుల ఆధారంగా వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్‌ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని వన్‌ప్లస్‌ తెలిపింది. 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్‌తోపాటు వన్‌ప్లస్‌ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్‌ కూడా విడుదల కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 15R Smartphone price leaked in india ahead of launch on december 17
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X