వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ టీజర్ విడుదల.. తొలి భారీ బ్యాటరీ ఫోన్‌గా నిలిచే అవకాశం ఉందా?
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. అనేక బెస్ట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, 7300mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
అయితే త్వరలో వన్‌ప్లస్ 15 సిరీస్ నుంచి మరో ఫోన్ లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వన్‌ప్లస్ అధికారికంగా వెల్లడించింది. వన్‌ప్లస్ 15R పేరుతో( OnePlus 15R Smartphone) ఈ ఫోన్ విడుదల కానుంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

రెండు కలర్ వేరియంట్స్ :
భారత్‌లో విడుదల కానున్న వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో ఇటీవల విడుదల అయిన వన్‌ప్లస్ ఏస్ 6 ఫోన్ లేదా త్వరలో విడుదలయ్యే వన్‌ప్లస్ ఏస్ 6T మోడల్ తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజాగా విడుదల అయిన ఫోటోల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. స్క్వేర్ కెమెరా డెకో డిజైన్‌ను కలిగి ఉంది. వన్‌ప్లస్ 15 కూడా ఇదే తరహా కెమెరా మాడ్యుల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్లను కలిగి ఉంది.

ప్లస్ కీ కూడా ఉండనుందా? :
అయితే ఈ ఫోన్ కుడివైపున ప్లస్ కీ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వన్‌ప్లస్ నుంచి ఇటీవల వచ్చిన కంపాక్ట్ మోడల్ వన్‌ప్లస్ 13s మరియు వన్‌ప్లస్ 15 ఫోన్‌లు ప్లస్ కీ ను కలిగి ఉన్నాయి. దీని ద్వారా అనేక ఫీచర్‌లను సులభంగా వినియోగించుకోవచ్చు.
అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు! :
వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల OLED 1.5K డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. 165Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీతో జతచేసే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఏకంగా 8000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. ఇదే నిజమైతే ఇంత సామర్థ్యంతో లాంచ్ కానున్న తొలి ఫోన్‌గా నిలిచిపోయే అవకాశం ఉంది.
అయితే ఈ స్పెసిఫికేషన్లపై వన్‌ప్లస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే క్రమంగా అన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








