రేపటి నుంచే వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ సేల్.. ఈ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.5 వేల డిస్కౌంట్!
OnePlus 15R Smartphone Sale : వన్‌ప్లస్ గత వారం భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ తోపాటు వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యా్బ్లెట్ కూడా విడుదల అయింది. అయితే డిసెంబర్ 18 నుంచే ఈ ట్యాబ్లెట్ సేల్ ప్రారంభం అయింది. వన్‌ప్లస్ 15R హ్యాండ్‌సెట్ సేల్ రేపు (డిసెంబర్ 22) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. తొలి సేల్‌లో భాగంగా బ్యాంకు డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది.
గరిష్ఠంగా రూ.5 వేల డిస్కౌంట్ :
వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.47999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.52999 గా ఉంది. యాక్సెస్, HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.5000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. తొలి సేల్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను అందిస్తోంది.

మూడు కలర్ వేరియంట్స్ :
ఈ వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ ను వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఎలక్ట్రిక్ వైలెట్, ఛార్‌కోల్ బ్లాక్, మింట్ బ్రీజ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని జతచేసి ఉంది. ఈ ఫోన్ Adreno 8 సిరీస్ GPU, టచ్ రెస్పాన్స్ చిప్, G2 Wi-Fi చిప్ ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు 43,940 mm sq కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOs 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని వన్‌ప్లస్ హామీ ఇచ్చింది.
1.5K అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ ఫోన్ 165Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, HDR10+ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా 120fps వద్ద 4K వీడియో రికార్డింగ్, సెల్ఫీ కెమెరా 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7400mAh బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 6.0, Wi-Fi 7, NFC, USB-C, GPS, NavIC వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








